కమ్మని పాట పరిమళం! | Jasleen Royal India's Got Talent audition | Sakshi
Sakshi News home page

కమ్మని పాట పరిమళం!

Published Wed, Sep 17 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

Jasleen Royal India's Got Talent audition

సోనమ్ కపూర్ నటించిన ‘ఖూబ్‌సూరత్’ సినిమాతో గాయనిగా పరిచయమైన ఢిల్లీ అమ్మాయి జస్లీన్ రాయల్ గొంతు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడే పియానో వాయించింది జస్లీన్. అలా సంగీతం మీద ప్రేమ ఆమెతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చింది.
 పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ఆమె సంగీత పాఠాలు చెబుతుండేది. అందులో ఆమె వయసు పిల్లలు కూడా ఉండేవారంటే ఆశ్చర్యమే.
 పాఠాలు చెప్పగా వచ్చిన డబ్బుతో రకరకాల సంగీత పరికరాలు కొనుక్కునేది జస్లీన్.
 ‘‘మా కుటుంబసభ్యుల్లో సంగీత నేపథ్యం ఉన్నవారు లేరు. అయినా వారెప్పుడూ నన్ను నిరాశపరిచేవారు కాదు. నా అభిరుచిని ప్రోత్సహించేవారు. నేను ఆర్థికస్వాతంత్య్రానికి ప్రాధాన్యం ఇస్తాను. ఖర్చులకు ఎవరి మీదా ఆధారపడకుండా, నాకు అవసరమైన డబ్బును నేనే సమకూర్చుకునేదాన్ని’’ అంటోంది జస్లీన్.
 ఎం టీవిలో ప్రసారమైన ‘పంచీ హో జవాన్’ ఆల్బమ్‌తో ‘ఖూబ్‌సూరత్’లో పాడే అకాశం జస్లీన్‌కు వచ్చింది.
 ‘ఖుబ్‌సూరత్’లో జస్లీన్ పాడిన ‘ప్రీత్’ అనే పాట సోనమ్ కపూర్‌కూ, ఆమె సోదరి రియాకపూర్‌కూ తెగ నచ్చేసింది.
 ‘‘ఇది నా మనసు దోచిన పాట’’ అని ఇద్దరూ ట్వీట్ చేసి జస్లీన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.
 పాపులర్ అయిన ఈ ‘ప్రీత్’ పాట పుణ్యమా అని మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశాలు జస్లీన్ తలుపు తడుతున్నాయి.
 అయితే, ఎన్ని పాటలు పాడాం అని లెక్కలు వేసుకోవడం కన్నా, ఎన్ని మంచి పాటలు పాడాం అనేది ముఖ్యమని నమ్ముతోంది ఈ కొత్త గాయని.
 ‘‘కొన్ని పాటలు వింటున్నప్పుడు సూటిగా హృదయాన్ని తాకినట్లు అనిపిస్తుంది. పాడిన వారి దగ్గరికి వెళ్లి, ‘ఎంత బాగా పాడారు...’ అని ప్రశంసించాలనిపిస్తుంది’’ అంటోంది జస్లీన్.
 నిజానికి ఆమె ‘ఖూబ్‌సూరత్’ చిత్రంలో పాడిన పాట విని చాలామంది ‘ఇంత అందమైన పాట పాడింది ఎవరు?’ అని ఆరా తీశారు. అది ఆమె తొలి విజయమే కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement