piano
-
ప్రధాని మోదీ మనసు గెలిచిన చిన్నారి
-
ఈ చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిన ప్రధాని మోదీ
మహిళతో కలిసి కన్నడ పాట పాడుతూ, అద్భుతంగా పియానో వాయిస్తున్న ఓ చిన్నారి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘పల్లవగల పల్లవియాలి’ అనే పాటకు పియానో వాయిస్తూ చిన్నారి శాల్మలీ ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిన్నారి టాలెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. పాప వీడియోను మోదీ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. చిన్నారి వీడియో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తెప్పిస్తుందన్నారు. ఆమెలో అసాధారణమైన ప్రతిభ, సృజనాత్మకత దాగుందన్నారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని శాల్మలీకి ఆశీస్సులు అందజేశారు. This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4 — Narendra Modi (@narendramodi) April 25, 2023 కాగా పల్లవగల పల్లవియాలి’ అంటూ చిన్నారి పాడిన పాటను కన్నడ కవి కేఎస్.నరసిహస్వామి రచించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. -
స్వీట్వాయిస్ చిట్టెమ్మ! చిన్నారి వీడియో వైరల్.. ఆహా’!
పియానో వాయిస్తూ ఒక మహిళతో కలిసి కన్నడ పాట పాడుతున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయింది. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. పాడుతున్న సమయంలో చిన్నారి ప్రదర్శించిన హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆహా’ అంటూ అబ్బురపడ్డారు. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. Listened to this so many times..What an inborn talent..🌹🌹 Source:Wa . pic.twitter.com/bm1LEY4Nn4 — Ananth Kumar (@anantkkumar) April 19, 2023 -
ఉక్రెయిన్‌లో కన్నీరు పెట్టించే సీన్.. ‘ప్రపంచం ఎంత అందమైనది’
ఉన్న ఊరు నన్ను విడిచిపో ప్రాణాలైనా మిగులుతయ్ అంటోంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్లముందే మసిబొగ్గై దర్శనమిస్తోంది. రుణం తీరిందని ఘోషిస్తోంది. రోజూ చూసే చెట్టూచేమ బాంబుల విధ్వంసంతో ఆకుపచ్చని వర్ణానికి బదులు నలుపెక్కిపోయాయి. ముళ్లేమూట సర్దుకుని పొరుగుదేశాలకు పోవడమొక్కటే ‘శరణ్యం’! గుంపులు గుంపులుగా జనం లివివ్ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నారు. రణభూమి నుంచి బయటపడితే చాలనే ఆశతో. అప్పుడే ఒక హృద్యమైన పియానో రాగం వారిని అటువైపునకు తిప్పుకుంది. ‘వాటే వండర్ఫుల్ వరల్డ్’ అంటూ వస్తున్న ఆ శబ్ద తరంగాలను విని సొంతూరు విడిచివెళ్తున్న జనం కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మాయదారి పంచాయితీ మా బతుకుల్ని ఆగం చేసిందనే ఆవేదనతో కూడిన కన్నీళ్లు అవి. ‘అవును ప్రపంచం ఎంతో అందమైనది’ అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లతో తూర్పు ఉక్రెయిన్ వైపునకు కొందరు, పొరుగు దేశాలకు మరికొందరు పయనమయ్యారు.. తమ ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచాన్ని వెతుక్కుంటూ. ఆండ్రూ ఆర్సీ మార్షల్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కాగా, ఉక్రెయిన్ రష్యా యుద్దం నేటితో 11వ రోజుకు చేరింది. Outside Lviv station, which is thronging with exhausted refugees fleeing war in eastern Ukraine, an accomplished pianist is playing “What a Wonderful World.” It’s hauntingly beautiful. pic.twitter.com/Xm5itr8jl7 — Andrew RC Marshall (@Journotopia) March 5, 2022 -
పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్
వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్ మేజ్ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది కొలెట్ట్. 1914 జూన్ 16 న ఫ్రెంచ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్ మేజ్. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్‌గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్ పియానో వదల్లేదు. ఆరో ఆల్బమ్.. షూమాన్, క్లాడ్ డెబస్సీ మ్యూజిక్‌ను ఇష్టపడే కొలెట్. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్ విడుదల చేసిన కొలెట్ట్. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్ ఇంజినీర్ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. సలాడ్ కన్నా ఆత్మీయ ఆహారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్ మేజ్... సలాడ్ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ. -
రతన్ టాటా లేటెస్ట్ లవ్... ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అంటే కేవలం బిజినెస్ వర్గాలకే కాదు ఇంటర్నెట్లో చాలామంది యువకులకూ ప్రేరణ. సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే రతన్ టాటా చాలా ఇన్స్పిరేషన్ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన వ్యక్తిగత ఇష్టంపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఆయనఅభిమానులు ఫిదా అవుతున్నారు. టాటా వ్యాపార సామ్రాజ్య విస్తరణ, సాదాసీదా జీవనంతో పాటు తాను మనసుపడే కీలక విషయాన్ని వెల్లడించారు రతన్ టాటా. పియానో వాయిస్తున్న అరుదైన చిత్రాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చిన్నప్పటినుంచీ తనకు పియానో వాయించడం అంటే ఇష్టమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉండటంతో సాధ్యపడలేదన్నారు. అయితే పదవీ విరమణ తర్వాత, పియానో నేర్చుకునేందుకు మంచి టీచర్ దొరికినా, రెండు చేతులు ఉపయోగించాల్సి రావడంతో, దానిపై శ్రద్ధ పెట్టలేకపోయానని తెలిపారు. సమీప భవిష్యత్తులో మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నట్టు తన పోస్ట్‌లో రాశారు. దీంతో తమ కమెంట్లతో రతన్ టాటాపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) -
అందుకోసం ఏడు గంటలు శ్రమించిన హృతిక్
సాయం చేసే మనసు ఉండాలే కానీ అది ఎలాగైనా, ఎన్ని రకాలుగానైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు సినీనటులు. కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమవంతు విరాళాలు ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఇంకా జనాలకు ఏ విధంగా సహాయపడవచ్చని పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టినదే.. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్. ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఎందరో సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటూ పాటలతో మాటలతో అలరిస్తూ కరోనాపై చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం హీరో హృతిక్ రోషన్ అంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకంటే అందరిలాగే హృతిక్ పాట పాడి వదిలేయలేదు. తనలో కొత్త కళను వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. (కరోనా: స్టార్ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య) తను పాడే పాటకు అవసరమైన మ్యూజిక్‌ను కూడా అతనే అందించుకున్నాడు. సులువుగా చెప్పాలంటే పియానో వాయిస్తూ పాట పాడాడు. దీని కోసం ఏడు గంటలు కష్టపడ్డాడు. అతను సింగర్ కాకపోయినా, పియానో వాయిద్యకారుడు కాకపోయినా పట్టుదలతో రెండింటినీ తన సొంతం చేసుకుని అదరహో అనిపించాడు. అతని అంకితభావానికి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కరోనాపై పోరులో ముందుండి పనిచేస్తున్న వారికి సెల్యూట్ చేయడమే కాక విరాళాలు సేకరించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు!) -
విరాళం ఇవ్వాలనిపిస్తే ఇస్తా!
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్పారు శ్రుతీహాసన్. ఇంతకీ ఏం జరిగిందంటే... ఇటీవల తాను పియానో వాయిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు శ్రుతి. ‘ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకపోతే బయటకు వెళ్లి ప్రజలకు సేవ చేయవచ్చుగా’, ‘కరోనా రిలీఫ్ ఫండ్‌కు మీరు ఇంకా ఎందుకు విరాళం ఇవ్వలేదు?’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారట. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘కరోనా సమయంలో ఎందుకు ప్రజలకు సేవ చేయడం లేదని కొందరు నా కామెంట్ బాక్స్‌లో స్పందించారు. నన్ను చేయమని చెప్పేవారు ప్రజలకు ఏ మాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు అనే మాటలను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తాను. అంతేకానీ అది ఇతరుల ఆదేశానుసారంగా జరగాలనుకోను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి..
జూబ్లీహిల్స్: నగరానికి చెందిన ప్రముఖ పియానిస్ట్ టీఎస్ సతీష్‌కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక్క నిమిషం వ్యవధిలో ఏకంగా 1999 నోట్స్ వాయించి జాతీయ రికార్డులకెక్కారు. వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సమక్షంలో ఇటీవల నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకు సతీష్‌కుమార్ పేరిట ఏకంగా 31 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. కళానిధి, కళారత్న, కళా శిరోమణి సహా పలు బిరుదులు ఆయనను వరించాయి. ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి.. సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సతీష్‌కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. కొంతకాలం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పియానో పట్టారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నిర్వహిస్తున్నాను. ఇక్కడ 200మంది విద్యార్థులు సంగీత పాఠాలునేర్చుకుంటున్నారు. రికార్డుల పరంపర ఇదీ.. లండన్‌లోని ప్రసిద్ధ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి 8వ గ్రేడ్ సర్టిఫికెట్, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు సాధించిన తొలి భారతీయుడిగా సతీష్ నిలిచారు. పియానో, ఎకోస్టిక్ డ్రమ్స్ వాయించడం ద్వారా 8వ డబుల్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. భారతదేశ సంగీత స్రష్టలుగా పేరుపొందిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు కూడా సింగిల్ గ్రేడ్ మాత్రమే సాధించడం గమనార్హం. రెహమాన్ అభినందనలు మరిచిపోలేను.. ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఇండియన్ బుక్ ఆఫ్రికార్డ్స్లో స్థానం సాధించా. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి వచ్చే నెల 25న డాక్టరేట్ అందుకోబోతున్నా. ఇప్పటికే ఇండియన్ జీనియస్ అవార్డు అందుకున్నాను. లండన్‌కు చెందిన హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ‘ఫాస్టెస్ట్ పియానిస్ట్ ఆఫ్ ద వరల్డ్’ సర్టిఫికెట్తో సత్కరించింది. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పలుమార్లు నన్ను ఫోన్లో అభినందించడం మర్చిపోలేని అనుభూతి. – టీఎస్ సతీష్‌కుమార్, పియానిస్ట్ -
డెలివరీ బాయ్.. అమేజింగ్ టాలెంట్
ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుందో చెప్పలేం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ డెలివరీ బాయ్ అనూహ్య రీతిలో తన టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరానికి చెందిన వర్చెట్టి కుటుంబం కొన్నిరోజుల కిందట పిజ్జాలు ఆర్డర్ ఇచ్చింది. బ్రైస్ డుడల్ అనే 18 ఏళ్ల విద్యార్థి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వర్చెట్టి ఇంటికి వెళ్లిన డుడల్ పిజ్జాను డెలివరీ చేశాడు. వారి ఇంట్లో పియానో చూసి ముచ్చటపడ్డ ఆ టీనేజర్ నేను ఒక్కసారి ప్లే చేయవచ్చా అని అడిగాడు. అందుకు జూలీ వర్చెట్టి ఆలోచిస్తూనే సరేనంది. వెంటనే పియానో ముందున్న బెంచ్‌పై కూర్చున్న డెలివరీ బాయ్ కొన్ని సెకన్లలోనే బటన్లపై చేతివేళ్లను వేగంగా కదిలించడం మొదలుపెట్టాడు. బీథోవెన్స్ ‘మూన్లైట్’ సొనాటాను చాలా అద్బుతంగా ప్లే చేశాడని ఆమె పొగడ్తల్లో ముంచేసింది. వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ అతడికి ఎంతో టాలెంట్ ఉందన్నారు జూలీ. ర్యాన్ వర్చెట్టి సైతం హర్షం వ్యక్తం చేశాడు. వీడియో గేమ్ ఆడుతున్న మా 10ఏళ్ల బాబు అది పక్కనపెట్టేసి మరీ పియానో ప్లే చేస్తున్నది ఎవరో చూసేందుకు వచ్చాడని తెలిపాడు. డెలివరీ బాయ్ డుడల్ పియానో వద్దకు వెళ్లగా.. అది పగలకొడతాడేమోనని అనిపించిందన్నాడు. చిన్నప్పటి నుంచీ పియానో ప్లే చేయడం అంటే ఇష్టమని, దాంతోపాటు బేస్‌బాల్ గేమ్ వల్ల తనకు స్కాలర్షిప్ వస్తుందని ఆగస్టులో మాకాంబ్ కమ్యూనిటీ కాలేజీలో చేరనున్నట్లు డెలివరీ బాయ్ తమకు చెప్పినట్లు ర్యాన్ వివరించాడు. అతడు పియానో ప్లే చేస్తుండగా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో అతడు పాపులర్ అయిపోయాడు. డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు కానీ.. ఈ టీనేజర్లో అమేజింగ్ టాలెంట్ ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. -
ఒక్క నిమిషంలో 1999 నోట్స్
నగరానికి చెందిన పియానో వాయిద్యకారుడు టీఎస్సతీశ్కుమార్ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. నిమిషం వ్యవధిలోనే 1,999 నోట్స్ వాయించి జాతీయ రికార్డు నెలకొల్పారు. జూబ్లీహిల్స్: వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఫిబ్రవరిలో నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో గుజరాత్‌కు చెందిన పియానో విద్వాంసుడు అమన్ బాట్ల నిమిషం వ్యవధిలో 1,208 నోట్స్ వాయించాడు. దీనిని సతీశ్‌కుమార్ బద్దలుకొట్టాడు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన సతీశ్ తండ్రి జయప్రకాష్ ఉపాధ్యాయుడు. ఇక్కడే పుట్టి పెరిగిన సతీశ్... ఉస్మానియాలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కొంతకాలం ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేశారు. మ్యూజిక్ మీదున్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి ఈ రంగంలోకి ప్రవేశించారు. ఇవీ ఘనతలు... సంగీత ప్రపంచంలో లండన్‌లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుంచి సర్టిఫికెట్ సాధించడం సంగీతకారులకు ఒక స్వప్నం. ఇలాంటి ఘనతను సతీశ్ సాధించారు. ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలో 8వ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు పొందారు. పియానో, ఎకోస్టిక్ డ్రమ్స్ వాయిద్యాలు వాయించి 8వ డబుల్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. భారత సంగీత సామ్రాట్టులుగా పేరొందిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు సైతం సింగిల్ గ్రేడ్ మాత్రమే సాధించడం గమనార్హం. త్వరలో డాక్టరేట్... ‘ప్రస్తుతం వెస్ట్ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహిస్తున్నాను. 200 మందికి పైగా విద్యార్థులు నా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి ఏప్రిల్ 25న డాక్టరేట్, త్వరలో గుజరాత్లో జరిగే కార్యక్రమంలో ఇండియన్ జీనియస్ అవార్డు అందుకోబోతున్నాను. నా శ్రీమతి విజయ కూడా సంగీతం శిక్షణ పొందారు. స్కూల్లో పాఠాలు చెబుతూ నాకు సహకరిస్తోంద’ని చెప్పారు సతీశ్‌కుమార్. -
శాస్త్రవేత్త కాకపోయి ఉంటే...
మీకు అల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలుసా? సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అని సైన్సు పుస్తకంలో చదువుతుంటారు కదా! ఆయన గురించి మీకు తెలియని మరో సంగతేమిటంటే... ఆయనకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఐన్‌స్టీన్ పదమూడో ఏట మోజార్ట్ అనే సంగీతకారుడి కచేరీ విన్నాడు. అంతే సంగీతంపై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి వయోలిన్, పియానో సాధన ప్రారంభించాడు. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో తలమునకలుగా ఉంటూ, తీరిక వేళల్లో సంగీత సాధనతో సేదదీరేవాడు. శాస్త్రవేత్త కాకపోయి ఉంటే సంగీతకారుడిగా ఎదిగేవాడినని చెప్పేవాడు. -
కమ్మని పాట పరిమళం!
సోనమ్ కపూర్ నటించిన ‘ఖూబ్సూరత్’ సినిమాతో గాయనిగా పరిచయమైన ఢిల్లీ అమ్మాయి జస్లీన్ రాయల్ గొంతు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడే పియానో వాయించింది జస్లీన్. అలా సంగీతం మీద ప్రేమ ఆమెతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ఆమె సంగీత పాఠాలు చెబుతుండేది. అందులో ఆమె వయసు పిల్లలు కూడా ఉండేవారంటే ఆశ్చర్యమే. పాఠాలు చెప్పగా వచ్చిన డబ్బుతో రకరకాల సంగీత పరికరాలు కొనుక్కునేది జస్లీన్. ‘‘మా కుటుంబసభ్యుల్లో సంగీత నేపథ్యం ఉన్నవారు లేరు. అయినా వారెప్పుడూ నన్ను నిరాశపరిచేవారు కాదు. నా అభిరుచిని ప్రోత్సహించేవారు. నేను ఆర్థికస్వాతంత్య్రానికి ప్రాధాన్యం ఇస్తాను. ఖర్చులకు ఎవరి మీదా ఆధారపడకుండా, నాకు అవసరమైన డబ్బును నేనే సమకూర్చుకునేదాన్ని’’ అంటోంది జస్లీన్. ఎం టీవిలో ప్రసారమైన ‘పంచీ హో జవాన్’ ఆల్బమ్‌తో ‘ఖూబ్సూరత్’లో పాడే అకాశం జస్లీన్‌కు వచ్చింది. ‘ఖుబ్సూరత్’లో జస్లీన్ పాడిన ‘ప్రీత్’ అనే పాట సోనమ్ కపూర్‌కూ, ఆమె సోదరి రియాకపూర్కూ తెగ నచ్చేసింది. ‘‘ఇది నా మనసు దోచిన పాట’’ అని ఇద్దరూ ట్వీట్ చేసి జస్లీన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పాపులర్ అయిన ఈ ‘ప్రీత్’ పాట పుణ్యమా అని మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశాలు జస్లీన్ తలుపు తడుతున్నాయి. అయితే, ఎన్ని పాటలు పాడాం అని లెక్కలు వేసుకోవడం కన్నా, ఎన్ని మంచి పాటలు పాడాం అనేది ముఖ్యమని నమ్ముతోంది ఈ కొత్త గాయని. ‘‘కొన్ని పాటలు వింటున్నప్పుడు సూటిగా హృదయాన్ని తాకినట్లు అనిపిస్తుంది. పాడిన వారి దగ్గరికి వెళ్లి, ‘ఎంత బాగా పాడారు...’ అని ప్రశంసించాలనిపిస్తుంది’’ అంటోంది జస్లీన్. నిజానికి ఆమె ‘ఖూబ్సూరత్’ చిత్రంలో పాడిన పాట విని చాలామంది ‘ఇంత అందమైన పాట పాడింది ఎవరు?’ అని ఆరా తీశారు. అది ఆమె తొలి విజయమే కదా!