
ఉన్న ఊరు నన్ను విడిచిపో ప్రాణాలైనా మిగులుతయ్ అంటోంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్లముందే మసిబొగ్గై దర్శనమిస్తోంది. రుణం తీరిందని ఘోషిస్తోంది. రోజూ చూసే చెట్టూచేమ బాంబుల విధ్వంసంతో ఆకుపచ్చని వర్ణానికి బదులు నలుపెక్కిపోయాయి. ముళ్లేమూట సర్దుకుని పొరుగుదేశాలకు పోవడమొక్కటే ‘శరణ్యం’!
గుంపులు గుంపులుగా జనం లివివ్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్తున్నారు. రణభూమి నుంచి బయటపడితే చాలనే ఆశతో. అప్పుడే ఒక హృద్యమైన పియానో రాగం వారిని అటువైపునకు తిప్పుకుంది. ‘వాటే వండర్‌ఫుల్ వరల్డ్’ అంటూ వస్తున్న ఆ శబ్ద తరంగాలను విని సొంతూరు విడిచివెళ్తున్న జనం కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మాయదారి పంచాయితీ మా బతుకుల్ని ఆగం చేసిందనే ఆవేదనతో కూడిన కన్నీళ్లు అవి.
‘అవును ప్రపంచం ఎంతో అందమైనది’ అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లతో తూర్పు ఉక్రెయిన్ వైపునకు కొందరు, పొరుగు దేశాలకు మరికొందరు పయనమయ్యారు.. తమ ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచాన్ని వెతుక్కుంటూ. ఆండ్రూ ఆర్‌సీ మార్షల్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. కాగా, ఉక్రెయిన్ రష్యా యుద్దం నేటితో 11వ రోజుకు చేరింది.
Outside Lviv station, which is thronging with exhausted refugees fleeing war in eastern Ukraine, an accomplished pianist is playing “What a Wonderful World.” It’s hauntingly beautiful. pic.twitter.com/Xm5itr8jl7
— Andrew RC Marshall (@Journotopia) March 5, 2022
Comments
Please login to add a commentAdd a comment