
Russia ruk jaaye, Ukraine jhuk jaaye: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్ అత్యంత దారుణంగా అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుపట్టడమే కాక హెచ్చరికలు జారీ చేశాయి. అంతేగాదు ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. అయినా రష్యా వాటిని లక్ష్యపెట్టక ఉక్రెయిన్ పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది.
దీంతో చాలామంది అగ్రనేతలు పలు రకాలుగా రష్యా అధ్యుక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పూజారి యుద్ధం ఆపమంటూ పుతిన్‌కి వింతైన రీతిలో సందేశం ఇచ్చాడు. అంతేకాదు రష్యా రుక్ జాయే, ఉక్రెయిన్ ఝుక్ జాయే(రష్యా యుద్ధం ఆపాలి, ఉక్రెయిన్ తప్పు చేసింది కాబట్టి క్షమించాలి) అంటూ తనదైన రీతిలో పిలుపు నిచ్చాడు.
రష్యా గొప్పది కాబట్టి యుద్ధం ఆపాలి అని చెబుతూ అందర్నీ ఆకర్షించాడు. అంతేకాదు భారత్ హింసకు స్వస్తి చెప్తి శత్రత్వానికి ముగింపు పలుకుతుంది అని భారతదేశం గొప్పతనాన్ని కూడా వివరించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
पुतिन,जेलेन्सकी सुन लें- अयोध्या से ऑर्डर हो गया है !! pic.twitter.com/bho9EFR8Og
— Gaurav Singh Sengar (@sengarlive) March 3, 2022
(చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!)
Comments
Please login to add a commentAdd a comment