Zelensky Said I'm Father Of Two Childrens: ఉక్రెయిన్ పై రష్యా పోరు సలుపుతూనే ఉంది. ఆఖరికి పలు దఫాలుగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రష్యా ఏ మాత్రం తగ్గక పోగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్ అత్యంత దారుణంగా అతలా కుతలమైపోవడమే గాక లక్షలాదిమంది ఉక్రెయిన్ పౌరులు ఆవేదనతో సరిహద్దులు దాటారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యూఎస్ మద్దతుతో జీవాయుధాలను తయారు చేస్తోందంటూ రష్యా ఆరోపణలు గుప్పించింది.
దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ ఆ ఆరోపణలను ఖండిచారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ..నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని. నేను తగిన దేశానికి అధ్యక్షుడిని. నా భూమి పై రసాయన లేదా ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలు అభివృద్ధి చేయలేదు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. మీకు కూడా తెలుసు. రష్యా అలాంటి ఆరోపణల నెపంతో జీవాయుధ దాడి చేస్తే మరిన్ని కఠినతరమైన ఆంక్షలను ఎదర్కొటుంది అని హెచ్చరించారు.
అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో ఉక్రెయిన్‌లో జీవ ఆయుధాల అభివృద్ధికి వాషింగ్టన్ నిధులు సమకూర్చిందని ఆరోపణలు చేశాడు. అంతేకాదు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ కూడా ఉక్రెయిన్‌లో ప్రాణాంతక వ్యాధికారకాలను రహస్యంగా వ్యాప్తి చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే కాక యూఎస్ నిధులు సమకూర్చిందని అన్నారు. ఉక్రెయిన్‌లో యుఎస్ సైనిక-జీవసంబంధ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా రష్యా మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బయోలేబోరేటరీలు పక్షి, గబ్బిలం, సరీ సృపాల వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. అలాగే ఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఆంత్రాక్స్‌పై పరిశోధనలు చేయనుందని తెలిపారు. ఆఖరికి కరోనావైరస్ నమూనాలతో కూడా ప్రయోగాలు చేస్తున్నాయి అని చెప్పారు.
అమెరికన్లు ఈ పనిని పూర్తి రహస్యంగా నిర్వహించారు. రష్యా సరిహద్దుల్లోనే వారి సైనిక-జీవ ల్యాబ్‌లను సృష్టించారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మాజీ సోవియట్ రిపబ్లిక్ జార్జియాలోని ల్యాబ్‌లో యునైటెడ్ స్టేట్స్ రహస్యంగా జీవ ప్రయోగాలు చేస్తోందని రష్యా పదేపదే ఆరోపించింది. అంతేకాదు ఉక్రెయిన్ లాగా NATO, యూరోపియన్ యూనియన్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శల దాడి చేసింది. అయితే అమెరికా ఆ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు తాను ఇద్దరు పిల్లల తండ్రిగా నిజమే చెబుతున్నానంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా.
(చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం)
Comments
Please login to add a commentAdd a comment