chemical weapons
-
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
రణరంగంలో రసాయనాయుధాలు!.. ప్రయోగిస్తే పెను విధ్వంసమే
యుద్ధం మొదలెట్టి రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం రాకపోతే యుద్ధాన్ని ఆరంభించిన పక్షానికి చికాకు, అసహనం పెరుగుతాయి. దీంతో మరింత భయంకరమైన ఆయుధ ప్రయోగానికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌పై దాడిలో విజయం కనుచూపుమేరలో కానరాకపోవడంతో రష్యా రసాయనాయుధాల ప్రయోగానికి దిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల దాటింది. ఇంతవరకు చెప్పుకోదగ్గ విజయం రష్యాకు దక్కినట్లు కనిపించడం లేదు. దీంతో యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థం కాని పుతిన్ భయంకర జనహనన ఆయుధాలను ప్రయోగించవచ్చనే భయాలున్నాయి. రష్యా విజయం కోసం రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు అధికమని యూఎస్ అనుమానిస్తోంది. ఇందుకోసం ముందుగా ఉక్రెయిన్‌లో జీవ, రసాయన ఆయుధాలున్నాయని రష్యా ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ను నిలవరించడానికనే సాకుతో రష్యా రసాయనాయుధాలు ప్రయోగించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఈ నెల 21న సుమీ నగరంలోని ఒక రసాయన ప్లాంట్‌ను రష్యా పేల్చివేసింది. దీంతో అక్కడి వాతావరణంలోకి భారీగా అమ్మోనియా విడుదలై స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. గతంలో పుతిన్ రసాయన ఆయుధాల ప్రయోగించిన దాఖలాలున్నాయని, అందువల్ల ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ తన సొంత పౌరులపై రసాయన దాడికి సన్నాహాలు చేస్తోందని అటుపక్క రష్యా విమర్శిస్తోంది. తమపై రసాయన ఆయుధ ప్రయోగ నేరారోపణ చేయడానికి ఉక్రెయిన్ ఈ దారుణానికి తలపడనుందని రష్యా రక్షణ మంత్రి ఆరోపించారు. రష్యా రూటే సెపరేటు కెమికల్ ఆయుధాల ప్రయోగంలో రష్యాకుక ఘన చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలుగా పలువురిని రష్యా ఈ ఆయుధాలు ఉపయోగించి పొట్టన పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. తాజాగా సిరియాలో పౌరులపై రసాయనాయుధాలను అధ్యక్షుడు బషర్ రష్యా సహకారంతో ప్రయోగించారని అమెరికా ఆరోపించింది. దీనిపై విచారణకు రష్యా అడ్డుపడుతోందని విమర్శించింది. అలాగే రష్యా ఏజెంట్ సెర్గీ స్కిరిపల్, ఆయన కుమార్తె యూలియాను లండన్‌లో ఈ ఆయుధాలతోనే రష్యా బలి తీసుకుందని విమర్శలున్నాయి. రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ సంస్థ గ్రు కు చెందిన ఇద్దరికి ఈ ఘటనతో సంబంధం ఉందని బ్రిటన్ ఆరోపించింది. 2020లో పుతిన్ చిరకాల విమర్శకుడు అలెక్సి నవల్నీపై విష ప్రయోగం జరిగింది. స్వదేశంలో ఒక విమాన ప్రయాణంలో ఆయన హఠాత్తుగా అస్వస్థుడయ్యాడు. అనంతరం ఆయన కోమాలోకి జారుకున్నారు. నరాల బలహీనతను కలిగించే కెమికల్ ఆయనపై ప్రయోగించినట్లు జర్మనీలో ఆయనపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే రష్యా త్వరలో ఉక్రెయిన్‌లో కెమికల్ వెపన్స్ వాడబోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగవచ్చు? నిజానికి రసాయనాయుధాలున్నాయన్న సాకుతో ఇతర దేశాలపై దాడులు చేసిన సంస్కృతి అమెరికాకే ఉంది. ఇరాక్ విషయంలో అమెరికా చేసిన ఘాతుకాన్ని ప్రపంచం మరిచిపోలేదు. నీవు నేర్పిన విద్యయే.. అన్నట్లు ప్రస్తుతం పుతిన్ అమెరికా చూపిన బాటలో పయనించే యోచనలో ఉన్నారు. రష్యా ఇలాంటి ఆయుధాలను వాడితే తాము తీవ్రంగా స్పందిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. నాటో సైతం ఇదే తరహా హెచ్చరిక చేసింది. రష్యా మాట వినకుండా వీటిని ప్రయోగిస్తే అప్పుడు తమ కూటమి నేరుగా యుద్ధంలో పాల్గొనాల్సివస్తుందని హెచ్చరించింది. ఒకపక్క దాడి మొదలై ఇన్ని రోజులైనా తగిన ఫలితం రాకపోవడం రష్యాను చికాకు పెడుతోంది. మరోవైపు రష్యా డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించడంలేదు. ఇప్పటికే అంతర్జాతీయ వ్యతిరేకతను మూటకట్టుకున్న పుతిన్ రసాయనాయుధాల్లాంటి తొందరపాటు చర్యకు దిగకపోవచ్చ ని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే పుతిన్ మనసు మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అసలేంటీ ఆయుధాలు? నిజానికి ప్రతి ఆయుధంలో కెమికల్స్ ఉంటాయి. ఉదాహరణకు తుపాకీ బుల్లెట్లలో ఉండే గన్ పౌడర్ ఒక రసాయన పదార్ధమే! అయితే జీవులను ఒక్కమారుగా చంపగలిగే ప్రమాదకరమైన వాయువులు లేదా ద్రావకాల మిశ్రమాన్ని అచ్చంగా రసాయనాయుధమంటారు. ఒపీసీడబ్ల్యూ (ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలిగిఉండేలా డిజైన్ చేసిన ఆయుధాలు, వస్తువులను రసాయనాయుధాలంటారు. ఉదాహరణకు అమ్మోనియా అధిక మోతాదులో విడుదలైతే అక్కడున్న మనుషులకు అంధత్వం, ఊపిరితిత్తుల విధ్వంసంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలోనే రసాయనాయుధాల వాడకం జరిగింది. ఆ యుద్ధంలో క్లోరిన్, ఫాస్జీన్, మస్టర్డ్ గ్యాస్‌ను ఇరుపక్షాలు వినియోగించాయి. కేవలం వీటివల్ల అప్పట్లో లక్ష మరణాలు సంభవించాయి. కాలం గడిచే కొద్దీ అత్యంత ప్రమాదకరమైన రసాయనాయుధాల తయారీ పెరిగింది. కోల్డ్‌వార్ సమయంలో యూ ఎస్, రష్యాలు ఇబ్బడిముబ్బడిగా వీటిని రూ పొందించాయి. తర్వాత కాలంలో పలు దేశాలు రహస్యంగా వీటి తయారీ, నిల్వ చేపట్టాయి. రసాయనాలు– రకాలు రసాయనాయుధాలను అవి కలిగించే ప్రభావాన్ని బట్టి పలు రకాలుగా వర్గీకరించారు. 1. చర్మంపై ప్రభావం చూపేవి (బ్లిస్టర్ ఏజెంట్స్): ఫాస్జీన్ ఆక్సైమ్, లెవిసైట్, మస్టర్డ్ గ్యాస్. 2. నరాలపై ప్రభావం చూపేవి (నెర్వ్ ఏజెంట్స్): టబున్, సరిన్, సొమన్, సైక్లో సరిన్. 3. రక్తంపై ప్రభావం చూపేవి (బ్లడ్ ఏజెంట్స్): సైనోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ సైనేడ్. 4. శ్వాసపై ప్రభావం చూపేవి (చోకింగ్ ఏజెంట్స్): క్లోరోపిక్రిన్, క్లోరిన్, డైఫాస్జిన్. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇద్దరు పిల్లల సాక్షిగా నిజమే చెబుతున్నా: జెలెన్ స్కీ
Zelensky Said I'm Father Of Two Childrens: ఉక్రెయిన్ పై రష్యా పోరు సలుపుతూనే ఉంది. ఆఖరికి పలు దఫాలుగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రష్యా ఏ మాత్రం తగ్గక పోగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్ అత్యంత దారుణంగా అతలా కుతలమైపోవడమే గాక లక్షలాదిమంది ఉక్రెయిన్ పౌరులు ఆవేదనతో సరిహద్దులు దాటారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యూఎస్ మద్దతుతో జీవాయుధాలను తయారు చేస్తోందంటూ రష్యా ఆరోపణలు గుప్పించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ ఆ ఆరోపణలను ఖండిచారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ..నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని. నేను తగిన దేశానికి అధ్యక్షుడిని. నా భూమి పై రసాయన లేదా ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలు అభివృద్ధి చేయలేదు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. మీకు కూడా తెలుసు. రష్యా అలాంటి ఆరోపణల నెపంతో జీవాయుధ దాడి చేస్తే మరిన్ని కఠినతరమైన ఆంక్షలను ఎదర్కొటుంది అని హెచ్చరించారు. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో ఉక్రెయిన్‌లో జీవ ఆయుధాల అభివృద్ధికి వాషింగ్టన్ నిధులు సమకూర్చిందని ఆరోపణలు చేశాడు. అంతేకాదు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ కూడా ఉక్రెయిన్‌లో ప్రాణాంతక వ్యాధికారకాలను రహస్యంగా వ్యాప్తి చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే కాక యూఎస్ నిధులు సమకూర్చిందని అన్నారు. ఉక్రెయిన్‌లో యుఎస్ సైనిక-జీవసంబంధ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా రష్యా మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బయోలేబోరేటరీలు పక్షి, గబ్బిలం, సరీ సృపాల వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. అలాగే ఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఆంత్రాక్స్‌పై పరిశోధనలు చేయనుందని తెలిపారు. ఆఖరికి కరోనావైరస్ నమూనాలతో కూడా ప్రయోగాలు చేస్తున్నాయి అని చెప్పారు. అమెరికన్లు ఈ పనిని పూర్తి రహస్యంగా నిర్వహించారు. రష్యా సరిహద్దుల్లోనే వారి సైనిక-జీవ ల్యాబ్‌లను సృష్టించారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మాజీ సోవియట్ రిపబ్లిక్ జార్జియాలోని ల్యాబ్‌లో యునైటెడ్ స్టేట్స్ రహస్యంగా జీవ ప్రయోగాలు చేస్తోందని రష్యా పదేపదే ఆరోపించింది. అంతేకాదు ఉక్రెయిన్ లాగా NATO, యూరోపియన్ యూనియన్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శల దాడి చేసింది. అయితే అమెరికా ఆ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు తాను ఇద్దరు పిల్లల తండ్రిగా నిజమే చెబుతున్నానంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం) -
మానవాళికి అది పెనుముప్పే: ఆర్మీ చీఫ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటం మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అవకాశముందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటూ అంతర్జాతీయ సరిహద్దులను అధిగమించి చొచ్చుకువస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులనే కాదు.. వారిని ప్రోత్సాహిస్తూ స్పాన్సర్లుగా ఉన్న వారిని సైతం చెదరగొట్టాల్సిన అవసరముందని, ఉగ్రవాదులకు స్పాన్సర్లుగా ఉన్న దేశాలను గుర్తించాలని సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ‘రైజినా2018’ సదస్సులో ఆర్మీ చీఫ్ రావత్ మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు, మిలిటెంట్లకు ఉన్న లింకులను తొలగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై కొంతమేరకు ఆంక్షలు విధించాల్సిన అవసరముందని, ప్రజాస్వామిక దేశాల ప్రజలు దీనిని అంగీకరించకపోయినా.. భద్రమైన వాతావరణం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని రావత్ అన్నారు. -
రసాయన దాడులు చేద్దాం!
► హిజ్బుల్ ఉగ్రవాదుల వ్యూహం ► పాక్ నుంచి రసాయనిక ఆయుధాలు న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు పాకిస్తాన్ రసాయనిక ఆయుధాలను సమకూర్చుతోందన్న సంచలన సమాచారం తాజాగా వెలుగు చూసింది. నిఘా సంస్థల వద్దనున్న ఉగ్రవాదుల సంభాషణల ఆడియోటేపులను సంపాదించిన సీఎన్ఎన్–న్యూస్18 చానల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకాలం గ్రెనేడ్లు, బాంబులు, తుపాకుల వంటి ఆయుధాల్ని వాడిన ఉగ్రవాదులు ఈసారి భారత ఆర్మీ ఊహించని రీతిలో రసాయనిక దాడి చేయాలని భావిస్తున్నారంది. గతకొన్ని నెలలుగా భారీ సంఖ్యలో ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీ కారంగా ముష్కరులు రసాయనిక దాడికి తెగించేందుకు సిద్ధమవుతున్నారంది. ఇందు కు తనవంతు సాయంగా పాకిస్తాన్ వారికి ఆయుధాలను సమకూర్చుతోంది. రసాయనిక ఆయుధాలు ఇప్పటికే ఉగ్రవాదులకు చేరినట్లుగా కూడా ఆడియో సంభాషణల్లో తెలిసింది. ‘పీర్ సాహెబ్ (లష్కరే తోయిబా చీఫ్ మహమ్మద్ సయీద్)కు నేను కావాలి. నా వాళ్లు కూడా నన్ను కోరుకుంటున్నారు. మన తర్వాతి కార్యక్రమం ఈద్ తర్వాత ఉంటుంది’ అని ఓ హిజ్బుల్ ఉగ్రవాది మాట్లాడాడు. ‘అల్లా దయతో మనకు పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సరిహద్దులో పనులు జరుగుతున్నాయి’ అని మరో ఉగ్రవాది అన్నాడు. మరో సందర్భంలో అదే ఉగ్రవాది మాట్లాడుతూ ‘ఇప్పటివరకు మనం బారత ఆర్మీపై గ్రెనేడ్లను విసిరాం. ముగ్గురు, నలుగురు మాత్రమే చనిపోయేవారు. మన వ్యూహాలను మార్చాల్సిన సమయమిది. మనం రసాయనిక ఆయుధాలను వాడి ఒకే దాడిలో వీలైనంత ఎక్కువ మందిని చంపుదాం’ అని అన్నాడు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందనడానికి, ప్రేరేపిస్తోందనడానికి ఈ ఆడియో సంభాషణలు బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వార్తా కథనంపై బీజేపీ నేత ఆర్కే సింగ్ స్పందిస్తూ ‘పాక్ రసాయనిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లయితే, అది యుద్ధానికి దారితీస్తుంది. హిజ్బుల్ చీఫ్ దీనిపై జాగ్రత్తగా ఆలోచించాలి’ అని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. ప్రస్తుతం దాదాపు 200 మంది సభ్యులు క్రియాశీలకంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్రి కులపై సోమవారం రాత్రి జరిగిన దాడిలోనూ హిజ్బుల్ ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యాత్రికులపై దాడి లష్కరే తోయిబా పనేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను లష్కరే ఖండిం చింది. తమపై నిందలు వేస్తున్నారనీ, అది ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా జరిగిన దాడి అని లష్కరే తెలిపింది. -
అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు
మాస్కో: అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. సిరియా మరోసారి రసాయిన దాడులు జరిపేలా అమెరికా తీవ్రంగా రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ రష్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా అన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా ఆమె స్పందించేందుకు నిరాకరించారు. సిరియా అధ్యక్షుడు అసద్ మరోసారి తమ దేశంలో అమాయకులపై రసాయినిక దాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని, అదే జరిగితే ఆయన పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కావాలనే అమెరికా సిరియా అధ్యక్షుడు అసద్‌పై మరోసారి నిందలు వేసేందుకు రెచ్చగొడుతోందని, ఇప్పటికే ప్రపంచాన్ని నమ్మించేలాగా కెమికల్ దాడులకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి తయారు చేసి సిద్ధంగా ఉంచినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. సిరియా కెమికల్ దాడులు చేసిన నేపథ్యంలో అమెరికా నేరుగా సిరియా ఎయిర్ బేస్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే, సిరియా అసలు రసాయన దాడులు దాడులు చేయలేదని, ఉగ్రవాదులపై యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బాంబులు నేరుగా కెమికల్ ఆయుధాలను ఢీకొట్టిన కారణంగా వెలువడిన వాయువులతోనే చనిపోయారని బసద్కు దన్నుగా నిలిచింది. -
ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు?
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పరిస్థితి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుంది. ఇరాకీ దళాలు మోసుల్ నగరంవైపు దూసుకుని వస్తుండటంతో.. వారిపై రసాయన దాడులు చేయడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మంగళవారం నాడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ అమెరికా దళాలు ఉన్న ప్రాంతానికి కొన్ని వందల గజాల దూరంలో పడింది. దాన్ని రసాయన ఆయుధాలతో ప్రయోగించినట్లు తర్వాత తేలింది. ఇరాక్ దళాలు మోసుల్ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోడానికి వీలుగా ఒక ఎయిర్‌ఫీల్డ్‌ను అక్కడ అమెరికా సైనికులు సిద్ధం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు. మొదట్లో ఆ రాకెట్లో కేవలం ఆవాలకు సంబంధించినదే అనుకున్నారు గానీ, తర్వాత చేసిన పరీక్షలో అందులో రసాయన ఆయుధాలు ఉన్నట్లు తేలిందని నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ విలేకరులకు తెలిపారు. ఇంతకుముందు కూడా ఐసిస్ ఇలాంటి దాడులు చేసి ఉంటుందని, కనీసం రెండు డజన్ల సార్లు వాళ్లు ఈ తరహా ఆయుధాలను ప్రయోగించి ఉంటారని అన్నారు. శుక్రవారం నాడు ఖయ్యారా సమీపంలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన రసాయన ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యం ధ్వంసం చేసింది. ఆవాల నూనెను ఆయుధంగా మార్చుకునే సామర్థ్యం ఐసిస్‌కు వచ్చిందని, వాళ్లు ఈ నూనెతో పాటు మరో రసాయన పదార్థాన్ని కలిపి దాన్ని ఆయుధంలా చేస్తున్నారని డేవిస్ అన్నారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉండకపోవచ్చు గానీ.. బాగా ఇబ్బంది కలిగిస్తుందని, సైనిక పరంగా దీన్ని అంత పెద్ద ముప్పుగా తాము పరిగణించబోమని అన్నారు. రసాయనాలను ఆయుధాలుగా మార్చడంలో ఐసిస్‌కు ఇంకా అంత నైపుణ్యం లేదు గానీ, ఒకవేళ వాళ్లు అలాంటి దాడులు చేస్తే ఎదుర్కోడానికి అమెరికా.. ఇరాకీ దళాలు మాత్రం ఇంకా సన్నద్ధం కావాల్సి ఉందని చెప్పారు. ఇరాక్ ప్రాంతానికి అమెరికా 50 వేల గ్యాస్ మాస్కులను పంపిందని, వాటిలో 40 వేల మాస్కులు కేవలం ఇరాకీ సైన్యానికే వెళ్తాయని తెలిపారు. -
సిరియా అంతర్యుద్ధంలో రసాయన ఆయుధాలు
సిరియా అంతర్యుద్థంలోరసాయన ఆయుధాలు వాడినట్లు ఆ దేశంలో వైద్య సేవలు అందిస్తున్న అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ పేర్కొంది. ఈ నెలతో సిరియాలో యుద్ధం మొదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం ఓ నివేదికను ఈ సంస్థ వెలువరించింది. 2015లో 161 సార్లు రసాయనఆయుధాలు వాడినట్లు నివేదిక పేర్కొంది. ఫలితంగా.. 1,491 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 14,581 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ సంస్థ సిరియాలో 1,700 మంది కార్యకర్తలతో 100 వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. పైన పేర్కొన్న విషయాలు బాధితులకు వైద్యం చేసిన తమ సంస్థ వైద్యులు తెలిపారని పేర్కొంది. -
ఐసిస్ నుంచి రసాయనిక ఆయుధాల ముప్పు
ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర రసాయనిక ఆయుధాలు ఉండటం మరింత కలవరపెట్టే అంశం. ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఉపయోగించడంతో పాటు చిన్నపాటి ఆయుధాలను తయారు చేయగలదని అమెరికా గూఢచర్య సంస్థ (సీఐఏ) డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ చెప్పారు. అంతేగాక నిధుల సేకరణ కోసం ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశముందని హెచ్చరించారు. వారు రవాణ చేయగలిగే మార్గాలను నియంత్రించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఐసిస్ దాడుల్లో రసాయనిక ఆయుధాలను వాడినట్టు తమ దగ్గర సమాచారముందని బ్రెన్నన్ చెప్పారు. రసాయనిక ఆయుధాలను వాడటం, తయారు చేయడంలో ఐసిస్ ఉగ్రవాదులకు సామర్థ్యం ఉందని తెలిపారు. ఇరాక్, సిరియాలో ఐసిస్ రసాయనిక ఆయుధాలను వాడినట్టు చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అమెరికా ఇంటలిజెన్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. -
ప్రమాదంలో ప్రపంచం!
-
నోబెల్ శాంతి బహుమతి రేసులో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సిరియా రసాయనిక ఆయుధాలను ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు రష్యాకు చెందిన ఒక సంస్థ పుతిన్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసింది. -
రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్‌కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్‌కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. -
సిరియాకు తొలగిన యుద్ధ ముప్పు!
ఏడాదిలోగా రసాయన ఆయుధాల నిర్మూలన అమెరికా-రష్యా ఆరు సూత్రాల ఫార్ములా యుద్ధానికి తామింకా సిద్ధమేనన్న ఒబామా మానవత్వంపై నేరాలకు పాల్పడ్డ అసద్ ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజం న్యూయార్క్/జెనీవా/వాషింగ్టన్/ఐరాస: సిరియాపై ముసిరిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తొలగినట్టే కన్పిస్తోంది. సిరియా వద్ద ఉన్న రసాయన ఆయుధాలను 2014 మధ్యకల్లా తొలగిం చడమో, నిర్మూలించడమో చేసే దిశగా అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా-రష్యా అంగీకరించాయి. ఈ దిశగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్గీ లావ్రోవ్ మూడు రోజులుగా జెనీవాలో జరుపుతున్న చర్చలు శనివారం ఓ కొలిక్కి వచ్చాయి. సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాల పూర్తి జాబితాను వారంలోగా అంతర్జాతీయ సమాజానికి అప్పగించడం, అవి ఉన్న ప్రాంతాలకు తనిఖీదారులకు నిర్నిరోధంగా ప్రవేశం కల్పించడం వంటి ఆరు సూత్రాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్టు మంత్రులిద్దరూ సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబర్‌లో సిరియాలో శాంతి సదస్సు జరుగుతుందని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదమయ్యాయని లావ్రోవ్ అన్నారు. కానీ సిరియాపై యుద్ధానికి దిగే ప్రతిపాదనను తామింకా పక్కన పెట్టలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజానికి ఒక అవకాశం ఇవ్వదలచాం. దీన్ని కాలయాపన ఎత్తుగడగా మార్చుకునే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను ఆయన హెచ్చరించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగేందుకు అమెరికా, అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు సిరియాపై సైనిక చర్యకు భారత్ నుంచి సమర్థన లభించడం లేదని అమెరికా అంగీకరించింది. అసద్ మానవత్వంపై క్రూర నేరాలకు పాల్పడ్డారంటూ ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజమెత్తారు. సిరియా రసాయన ఆయుధాలు వాడిందనేందుకు తిరుగులేని రుజువులను నిపుణుల బృందం వచ్చే వారానికల్లా తనకు అందజేస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. -
తాత్కాలిక శాంతి!
సంపాదకీయం: ప్రయత్నించాలే గానీ ఏదీ అసాధ్యం కాదు. ‘చేరి మూర్ఖుని మనసు రంజింప రాద’ని భర్తృహరి హితబోధ చేసినా, ఆశ ఉంటుంది గనుక మానవ ప్రయత్నం ఎప్పుడూ ఆగిపోదు. సిరియాపై యుద్ధానికి దిగడం ఆ దేశ ప్రజలకుగానీ, అమెరికాకుగానీ ఉపయోగపడదని ప్రపంచ దేశాలన్నీ చేసిన హెచ్చరికలు అగ్రరాజ్యంలో విజ్ఞత కలిగించినట్టున్నాయి. రష్యా చొరవ ఫలించి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకుపడింది. సిరియాలో ఉన్నాయంటున్న రసాయన ఆయుధాల నిల్వలను నియంత్రణలోకి తీసుకుని ధ్వంసంచేస్తానని రష్యా ఇచ్చిన హామీకి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సంక్షోభం అంచుల్లో ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఈ పరిణామంతో కాస్తంత ఊరట లభించింది. గత రెండున్నరేళ్లుగా సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. పట్టణాలూ, పల్లెలూ రణక్షేత్రాలుగా మారాయి. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటు దళాలు పరస్పరం కలహించుకుంటూ ఊళ్లన్నిటినీ వల్లకాళ్లుగా మారుస్తున్నారు. సిరియా వర్తమాన స్థితికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బాధ్యత ఎంత ఉన్నదో పాశ్చాత్య దేశాల బాధ్యతా అంతే ఉంది. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన ప్రజాస్వామ్య ఉద్యమం సెగ మిగిలిన దేశాల్లాగే సిరియానూ తాకినా అది త్వరలోనే చేయి దాటిపోవడానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదే. సిరియాలో లభ్యమయ్యే నాణ్యమైన చమురుపై కన్నేసిన పాశ్చాత్య ప్రపంచం ఈ సాకుగా ఆ దేశానికి పొరుగునున్న టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాలద్వారా తిరుగుబాటుదారులను సాయుధం చేసింది. అందులో అల్- కాయిదా అనుకూల వర్గాలు కూడా చేరాయని తెలిసినా తన చేష్టలను మానలేదు. గత నెల 21న సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన రసాయన ఆయుధ ప్రయోగం తర్వాత వందలమంది మరణించడంతో ఎప్పటినుంచో సిరియాపై కాలుదువ్వుతున్న అమెరికాకు సాకు దొరికింది. ఒకపక్క ఆ దాడికి బాధ్యులెవరో, ఏ తరహా రసాయనాన్ని ప్రయోగించారో తేల్చడానికి ఐక్యరాజ్యసమితి బృందం ప్రయత్నిస్తుంటే ఇదే అదునుగా యుద్ధ ప్రకటన చేయడానికి అమెరికా తహతహ లాడిపోయింది. అసద్ వద్ద వెయ్యి టన్నుల రసాయన ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవన్నీ దేశంలోని 50 పట్టణాల్లో నేలమాళిగల్లో ఉంచారని ప్రకటించింది. ఇందులో నిజమెంతో, కానిదెంతో తేల్చాల్సింది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సంస్థలే తప్ప అమెరికా కాదు. అయినా, అలాంటి సంస్థలతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించింది. ఈ యుద్ధంలో పాలు పంచుకునేందుకు బ్రిటన్ పార్లమెంటు అంగీకరించకపోవడం, ఫ్రాన్స్ పార్లమెంటు సైతం అదే తోవలో వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అమెరికా ముందుకు కదల్లేకపోయింది. రష్యాలో ఈమధ్యే ముగిసిన జీ-20 దేశాల సమావేశం కూడా ఆచి తూచి అడుగేయమని అమెరికాకు నచ్చజెప్పింది. వీటన్నిటి వెనకా ఉన్నది ఒకే కారణం... ఆర్ధికంగా ఉన్న గడ్డు పరిస్థితులు. ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా పుట్టి విస్తరించిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ప్రపంచ దేశాలు మరో సంక్షోభానికి సిద్ధంగా లేవు. ఎవరిదాకానో అవసరం లేదు... అమెరికా ప్రజలే సిరియాపై యుద్ధసన్నాహాలు చూసి వణికారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనబడుతున్న ఆర్ధిక వ్యవస్థ మళ్లీ చితికి పోతుందేమోనని భయపడ్డారు. రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ ప్రతిపాదనకు చిక్కులు ఏర్పడవచ్చన్న సందేహం ఒబామాకు కలిగింది. తన మేకపోతు గాంభీర్యానికి భంగం కలగకుండా ఈ సమస్యనుంచి బయట పడటం ఎలాగా అని ఆయన ఆలోచిస్తున్నవేళ రష్యా చొరవ తీసుకుని జరిపిన దౌత్యం ఆయనకు అందివచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరించిందని కాదు... మా మిత్ర దేశం ఒప్పించింది గనుక రసాయన ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించామని అధ్యక్షుడు అసద్ చెబుతున్నారు. ఆ ఆయుధాలను నాశనం చేయించే పూచీనాదని రష్యా హామీపడింది. యుద్ధానికి దిగుతామని బెదిరించి ఎవరినీ లొంగదీయలేరని, అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం వెదకాలని రష్యా అంటున్నది. రష్యాకు సిరియాపై ఇంత ప్రేమ ఉండటానికి కారణాలున్నాయి. మధ్యధరా సముద్రంలో రష్యాకున్న ఏకైక నావికాదళ స్థావరం సిరియాలోనే ఉంది. పైగా, రష్యానుంచి భారీయెత్తున ఆయుధాలు కొంటూ అందుకు ప్రతిగా నాణ్యమైన ముడి చమురు సరఫరా చేస్తున్న దేశం సిరియా. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు చమురే ప్రాణంగా మారిన వర్త మాన స్థితిలో అలాంటి ప్రయోజనాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదు. అసలు సిరియాలో ఉన్న రసాయన ఆయుధాలపై ఇంతగా బెంగటిల్లుతున్న అమెరికా ఆ పొరుగున ఇజ్రాయెల్ వద్దనున్న అదే బాపతు ఆయుధాల గురించి ఒక్క మాట మాట్లాడదు. 1993లో అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందంపై సంతకం చేసినా దాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చి ఆమోదం పొందని దేశం ఇజ్రాయెల్. ఇంకా చెప్పాలంటే అమెరికా, రష్యాలవద్ద సైతం రసాయన ఆయుధాల గుట్టలున్నాయి. వాటిని ధ్వంసం చేయడానికి గడువు మీద గడువు కోరుతూ కాలక్షేపం చేసిన ఆ రెండు దేశాలూ తుది గడువు 2012ను కూడా దాటబెట్టేశాయి. నిజానికి అమెరికా తదితర దేశాలవద్దనున్న సంప్రదాయిక ఆయుధాలు ఈ రసాయన ఆయుధాలకంటే అత్యంత ప్రమాదకరమైనవి. వాటన్నిటినీ ధ్వంసించకుండా సిరియా వల్లే ప్రపంచానికి ఏదో పెను ముప్పు సంభవించబోతున్నదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించడం నయ వంచన. ఇప్పటికైతే, యుద్ధ భయం తాత్కాలికంగా తొలగిందిగానీ, ఈ నయ వంచన బట్టబయలై, అందరికీ సమానంగా వర్తించే నియమనిబంధనలు రూపొందినప్పుడే ప్రపంచం సురక్షితంగా ఉండగలుగుతుంది. అంతవరకూ ఏ ఒప్పందాలైనా తీసుకొచ్చేది తాత్కాలిక శాంతిని మాత్రమే. -
మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా
మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు. -
సిరియాపై దాడి విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా
న్యూయార్క్: సిరియాపై దాడి విషయంలో అమెరికా వెనక్కితగ్గింది. రసాయన ఆయుధాలను అప్పగిస్తే దాడులు చేయం అని అమెరికా చెప్పింది. రసాయనిక ఆయుధాల అప్పగింతకు సిరియా అంగీకారం తెలిపింది. రసాయన ఆయుధాల నిర్వీర్య బాధ్యతను రష్యా స్వీకరించనుంది. ఈ విషయమై అమెరికా- రష్యాల మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయి. సిరియాపై ఏకపక్షంగా సైనిక చర్యకు పాల్పడాలనే యోచనను భారత్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సిరియాపై చేపట్టే ఎలాంటి చర్యలైనా ఐక్యరాజ్య సమితి నిర్ణయానికి లోబడే ఉండాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిరియాలో రసాయనిక ఆయుధాల వినియోగంపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తు నివేదిక వెలువడేంత వరకు వేచి ఉండాలని జీ-20 నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో నిమిత్తం లేకుండానే, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించగానే సిరియాపై సైనిక దాడి చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికా వెనక్కితగ్గడం శుభపరిణామంగా భావించవచ్చు. -
సిరియాపై దాడి విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా
న్యూయార్క్: సిరియాపై దాడి విషయంలో అమెరికా వెనక్కితగ్గింది. రసాయన ఆయుధాలను అప్పగిస్తే దాడులు చేయం అని అమెరికా చెప్పింది. రసాయనిక ఆయుధాల అప్పగింతకు సిరియా అంగీకారం తెలిపింది. రసాయన ఆయుధాల నిర్వీర్య బాధ్యతను రష్యా స్వీకరించనుంది. ఈ విషయమై అమెరికా- రష్యాల మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయి. సిరియాపై ఏకపక్షంగా సైనిక చర్యకు పాల్పడాలనే యోచనను భారత్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సిరియాపై చేపట్టే ఎలాంటి చర్యలైనా ఐక్యరాజ్య సమితి నిర్ణయానికి లోబడే ఉండాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిరియాలో రసాయనిక ఆయుధాల వినియోగంపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తు నివేదిక వెలువడేంత వరకు వేచి ఉండాలని జీ-20 నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో నిమిత్తం లేకుండానే, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించగానే సిరియాపై సైనిక దాడి చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికా వెనక్కితగ్గడం శుభపరిణామంగా భావించవచ్చు. -
సిరియా వైపుగా కదులుతున్న రష్యా యుద్ధనౌకలు
ఇస్తాంబుల్: సిరియాలో ప్రభుత్వం పౌరులపై రసాయన ఆయుధాలు ప్రయోగించిందన్న ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా దాడులకు సిద్ధమవుతుండగా.. మరో పక్క దాడులను వ్యతిరేకిస్తున్న రష్యా తన యుద్ధనౌకలను సిరియా వైపుగా పంపుతోంది. రష్యాకు చెందిన మూడు యుద్ధనౌకలు గురువారం టర్కీకి చెందిన బోస్ఫోరస్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని దాటి సిరియా తీరం వైపుగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతో మధ్యధరా ప్రాంతంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. సిరియా సంక్షోభం నేపథ్యంలో దాని మిత్ర దేశమైన రష్యా కొన్ని నెలలుగా నాలుగు యుద్ధనౌకలను అప్రమత్తం చేసింది. సిరియా నావికాదళ పోర్టులో రష్యాకు స్థావరం కూడా ఉంది. రసాయన దాడుల నెపంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐరాస అనుమతి లేకుండానే అమెరికా మిలటరీ దాడులు చేపట్టడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
సిరియా ఘటనపై ఐరాస దిగ్ర్భాంతి
ఐక్యరాజ్యసమితి : సిరియాలో రసాయన ఆయుధాల వినియోగంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. నిన్న రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియా పరిణామాలపై సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ షాక్‌కు గురయ్యారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. సమితి రసాయన ఆయుధాల తనిఖీబృందం సిరియాలో ఉండగానే..డెమాస్కస్‌లో వాటి ప్రయోగం జరగడాన్ని సమితి సెక్రెటరీ జెనరల్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. మరోవైపు సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగం జరిగిందన్న వార్తలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అసాద్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన అగ్రరాజ్యం, సిరియా విషయంలో తమతో విభేదించేవారు సైతం.. రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనంది. సిరియా పరిణామాలపై స్పందించిన అమెరికా విదేశాంగశాఖ, అధ్యక్ష భవనాలు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఇక రాజధాని డమాస్కస్ పరిసరాల్లో జరిగిన ఈ దారుణ మారణకాండలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది స్త్రీలు, చిన్నారులు ఉన్నారు. డమాస్కస్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సైనిక బలగాలు విచక్షణ రహితంగా క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. విషపూరిత వాయువుల ప్రయోగం, క్షిపణి దాడులతో 1, 228 మంది బాధితులుగా మారారని వైద్యవర్గాలు తెలిపాయి. అయితే రసాయనిక ఆయుధాల ప్రయోగం వార్తలను అధ్యక్ష వర్గాలు ఖండించాయి. ఎలాంటి విషపూరిత పదార్థాలు వినియోగించలేదని సైన్యం తెలిపింది. సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సినియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచేసుకోవటం గమనార్హం.