న్యూయార్క్: సిరియాపై దాడి విషయంలో అమెరికా వెనక్కితగ్గింది. రసాయన ఆయుధాలను అప్పగిస్తే దాడులు చేయం అని అమెరికా చెప్పింది. రసాయనిక ఆయుధాల అప్పగింతకు సిరియా అంగీకారం తెలిపింది. రసాయన ఆయుధాల నిర్వీర్య బాధ్యతను రష్యా స్వీకరించనుంది. ఈ విషయమై అమెరికా- రష్యాల మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయి.
సిరియాపై ఏకపక్షంగా సైనిక చర్యకు పాల్పడాలనే యోచనను భారత్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సిరియాపై చేపట్టే ఎలాంటి చర్యలైనా ఐక్యరాజ్య సమితి నిర్ణయానికి లోబడే ఉండాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిరియాలో రసాయనిక ఆయుధాల వినియోగంపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తు నివేదిక వెలువడేంత వరకు వేచి ఉండాలని జీ-20 నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో నిమిత్తం లేకుండానే, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించగానే సిరియాపై సైనిక దాడి చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికా వెనక్కితగ్గడం శుభపరిణామంగా భావించవచ్చు.
సిరియాపై దాడి విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా
Published Tue, Sep 10 2013 9:01 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement