సిరియా అంతర్యుద్ధంలో రసాయన ఆయుధాలు | Chemical weapons in the civil war in Syria | Sakshi
Sakshi News home page

సిరియా అంతర్యుద్ధంలో రసాయన ఆయుధాలు

Published Mon, Mar 14 2016 7:47 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

Chemical weapons in the civil war in Syria

సిరియా అంతర్యుద్థంలోరసాయన ఆయుధాలు వాడినట్లు ఆ దేశంలో వైద్య సేవలు అందిస్తున్న అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ పేర్కొంది. ఈ నెలతో సిరియాలో యుద్ధం మొదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం ఓ నివేదికను ఈ సంస్థ వెలువరించింది. 2015లో 161 సార్లు రసాయనఆయుధాలు వాడినట్లు నివేదిక పేర్కొంది. ఫలితంగా.. 1,491 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 14,581 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ సంస్థ సిరియాలో 1,700 మంది కార్యకర్తలతో 100 వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. పైన పేర్కొన్న విషయాలు బాధితులకు వైద్యం చేసిన తమ సంస్థ వైద్యులు తెలిపారని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement