ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు? | Islamic state makes chemical weapons, says pentagon official | Sakshi
Sakshi News home page

ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు?

Published Tue, Sep 27 2016 1:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు?

ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు?

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పరిస్థితి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుంది. ఇరాకీ దళాలు మోసుల్ నగరంవైపు దూసుకుని వస్తుండటంతో.. వారిపై రసాయన దాడులు చేయడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మంగళవారం నాడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ అమెరికా దళాలు ఉన్న ప్రాంతానికి కొన్ని వందల గజాల దూరంలో పడింది. దాన్ని రసాయన ఆయుధాలతో ప్రయోగించినట్లు తర్వాత తేలింది. ఇరాక్ దళాలు మోసుల్ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోడానికి వీలుగా ఒక ఎయిర్‌ఫీల్డ్‌ను అక్కడ అమెరికా సైనికులు సిద్ధం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు.

మొదట్లో ఆ రాకెట్‌లో కేవలం ఆవాలకు సంబంధించినదే అనుకున్నారు గానీ, తర్వాత చేసిన పరీక్షలో అందులో రసాయన ఆయుధాలు ఉన్నట్లు తేలిందని నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ విలేకరులకు తెలిపారు. ఇంతకుముందు కూడా ఐసిస్ ఇలాంటి దాడులు చేసి ఉంటుందని, కనీసం రెండు డజన్ల సార్లు వాళ్లు ఈ తరహా ఆయుధాలను ప్రయోగించి ఉంటారని అన్నారు. శుక్రవారం నాడు ఖయ్యారా సమీపంలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన రసాయన ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యం ధ్వంసం చేసింది.

ఆవాల నూనెను ఆయుధంగా మార్చుకునే సామర్థ్యం ఐసిస్‌కు వచ్చిందని, వాళ్లు ఈ నూనెతో పాటు మరో రసాయన పదార్థాన్ని కలిపి దాన్ని ఆయుధంలా చేస్తున్నారని డేవిస్ అన్నారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉండకపోవచ్చు గానీ.. బాగా ఇబ్బంది కలిగిస్తుందని, సైనిక పరంగా దీన్ని అంత పెద్ద ముప్పుగా తాము పరిగణించబోమని అన్నారు. రసాయనాలను ఆయుధాలుగా మార్చడంలో ఐసిస్‌కు ఇంకా అంత నైపుణ్యం లేదు గానీ, ఒకవేళ వాళ్లు అలాంటి దాడులు చేస్తే ఎదుర్కోడానికి అమెరికా.. ఇరాకీ దళాలు మాత్రం ఇంకా సన్నద్ధం కావాల్సి ఉందని చెప్పారు. ఇరాక్ ప్రాంతానికి అమెరికా 50 వేల గ్యాస్ మాస్కులను పంపిందని, వాటిలో 40 వేల మాస్కులు కేవలం ఇరాకీ సైన్యానికే వెళ్తాయని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement