ఐసిస్ నుంచి రసాయనిక ఆయుధాల ముప్పు | IS militants have used, can make chemical weapons: | Sakshi
Sakshi News home page

ఐసిస్ నుంచి రసాయనిక ఆయుధాల ముప్పు

Published Fri, Feb 12 2016 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

IS militants have used, can make chemical weapons:

ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర రసాయనిక ఆయుధాలు ఉండటం మరింత కలవరపెట్టే అంశం. ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఉపయోగించడంతో పాటు చిన్నపాటి ఆయుధాలను తయారు చేయగలదని అమెరికా గూఢచర్య సంస్థ (సీఐఏ) డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ చెప్పారు. అంతేగాక నిధుల సేకరణ కోసం ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశముందని హెచ్చరించారు. వారు రవాణ చేయగలిగే మార్గాలను నియంత్రించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఐసిస్ దాడుల్లో రసాయనిక ఆయుధాలను వాడినట్టు తమ దగ్గర సమాచారముందని బ్రెన్నన్ చెప్పారు. రసాయనిక ఆయుధాలను వాడటం, తయారు చేయడంలో ఐసిస్ ఉగ్రవాదులకు సామర్థ్యం ఉందని తెలిపారు. ఇరాక్, సిరియాలో ఐసిస్ రసాయనిక ఆయుధాలను వాడినట్టు చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అమెరికా ఇంటలిజెన్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement