
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తాజాగా తన వ్యక్తిగత ఇష్టంపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు.
సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అంటే కేవలం బిజినెస్ వర్గాలకే కాదు ఇంటర్నెట్‌లో చాలామంది యువకులకూ ప్రేరణ. సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే రతన్ టాటా చాలా ఇన్స్‌పిరేషన్ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన వ్యక్తిగత ఇష్టంపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఆయనఅభిమానులు ఫిదా అవుతున్నారు.
టాటా వ్యాపార సామ్రాజ్య విస్తరణ, సాదాసీదా జీవనంతో పాటు తాను మనసుపడే కీలక విషయాన్ని వెల్లడించారు రతన్ టాటా. పియానో వాయిస్తున్న అరుదైన చిత్రాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చిన్నప్పటినుంచీ తనకు పియానో వాయించడం అంటే ఇష్టమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉండటంతో సాధ్యపడలేదన్నారు. అయితే పదవీ విరమణ తర్వాత, పియానో నేర్చుకునేందుకు మంచి టీచర్ దొరికినా, రెండు చేతులు ఉపయోగించాల్సి రావడంతో, దానిపై శ్రద్ధ పెట్టలేకపోయానని తెలిపారు. సమీప భవిష్యత్తులో మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నట్టు తన పోస్ట్‌లో రాశారు. దీంతో తమ కమెంట్లతో రతన్ టాటాపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నారు నెటిజన్లు.