సుస్వరాయల్ పదహారు సంవత్సరాల వయసులోనే రకరకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ను ప్లే చేసే నైపుణ్యం జస్లీన్ రాయల్ సొంతం అయింది. ఆ తరువాత ఒకే సమయంలో మల్టీపుల్ మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ‘పంచి హో జవాన్’ సింగిల్‌తో సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకుంది. ‘బార్ బార్ దేఖో’ (2015)తో బాలీవుడ్‌లో కంపోజర్‌గా బ్రేక్ వచ్చింది.
‘ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మ్యూజిక్ కంపోజర్ అయ్యాను. నా మీద నాకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. కాలేజీ రోజుల్లో అందరూ ప్లాన్ బీ గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా నా మార్గం మ్యూజిక్ మాత్రమే అనుకున్నాను. రియాల్టీ షోలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా తొలిసారి గుర్తింపు లభించింది’ అంటున్న జస్లీన్‌కు మెలోడీలు అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రయాణమార్గాలలో తట్టే ట్యూన్‌లను పాటలుగా మలచడం అంటే ఇష్టం. కంపోజర్, సింగర్ అయిన జస్లీన్ రాయల్ తన తొలి ప్రాధాన్యత కంపోజింగ్ మాత్రమే అంటుంది.
Comments
Please login to add a commentAdd a comment