న్యూ రిలీజ్ ‘అస్సీ సజ్నా’తో ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్ జస్లీన్ రాయల్. 2009లో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో ఒకే సమయంలో ఎన్నో ఇన్‌స్ట్రుమెంట్‌లు ప్లే చేసి వావ్ అనిపించింది. ఇండీ ఆర్టిస్ట్‌గా ప్రయాణంప్రారంభించిన రాయల్ బాలీవుడ్‌లోనూ తన టాలెంట్ నిరూపించుకుంది.
‘నేనొక మ్యూజిక్ కంపోజర్‌ని. విత్ అవుట్ ఎనీ ట్రైనింగ్’ అంటుంది రాయల్. సంగీతంలో శిక్షణ తీసుకోనప్పటికీ ఆత్మన్యూనతకు మాత్రం ఎప్పుడూ లోనుకాలేదు. ‘యస్. నేను చేయగలను’ అంటూ స్వర విహారం చేస్తుంది. ‘ఐయామ్ బ్యాక్ టూ ది బేసిక్స్’ అంటూ తన ప్రయాణాన్ని పున:సమీక్షించుకుంటుంది రాయల్. ΄ాట హిట్ అయితే కాసేపు సంతోషించి ఆ సక్సెస్‌తో డిస్‌కనెక్ట్ అయ్యి ‘నెక్ట్స్‌ప్రాజెక్ట్’లోకి జంప్ చేయడం రాయల్ అనుసరిస్తున్న విధానం.
‘ప్రతి ΄ాట నాకు ఎంతో ఇచ్చింది’ అంటున్న రాయల్ తన తాజా ΄ాట ‘అస్సీ సజ్నా’ గురించి ఏంచెబుతుంది? ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... జీవితంతో ప్రేమలో పడేలా చేసే సాంగ్. జీవనోత్సాహాన్ని వెలిగించే సాంగ్. జీవితంలోని ఆనంద క్షణాలు గుర్తు తెచ్చుకొని ఆస్వాదించేలా చేసే సాంగ్. ‘బాధ నుంచి బయట పడేలా చేసే ΄ాట’ అంటుంది రాయల్. పెళ్లి ΄ాటల్లో తనదైన పేరు తెచ్చుకున్న రాయల్‌ను ‘పెళ్లి ΄ాటల మహారాణి’ అని పిలుస్తారు అభిమానులు.
మ్యూజిక్ ఇన్స్రు
స్టు్టమెంట్స్ గురించి రాయల్‌కు చిన్నప్పటి నుంచే ఆసక్తి. వాటిని ఎలా ప్లే చేయాలో నేర్చుకునేది. ఎప్పుడైనా మెలోడి తన బుర్రలోకి వస్తే....అది ఏదో ఒక ఇన్‌్రçస్టు్టమెంట్ మీద తీయగా పలికేది. బాలీవుడ్‌లో బంధువులు లేరు. గాడ్ ఫాదర్ లేరు. కేవలం తన మీద నమ్మకంతో పంజాబ్‌లోని లుథియానా నుంచి ముంబైకి వచ్చి సింగర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది జస్లీన్ రాయల్.
Comments
Please login to add a commentAdd a comment