ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్‌ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి.
బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది.
బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది.
స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టైల్‌లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
Comments
Please login to add a commentAdd a comment