ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'బివైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) హైదరాబాద్‌కి చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం చైనా సంస్థ మన దేశంలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రతి పాదనను కేంద్రం నిరాకరించింది. భద్రత పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
(ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!)
ఇప్పటికే బివైడీ కంపెనీ ఈ6, ఆటో వంటి కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సమయంలో కేంద్రం ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర కూడా దీనికి అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment