ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్‌ అంబానీ.. ఎంతటి దుస్థితి! | world 6th Richest Businessman Anil Ambani Failure Story | Sakshi

ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్‌ అంబానీ.. ఎంతటి దుస్థితి!

Apr 6 2024 6:45 PM | Updated on Apr 7 2024 4:54 PM

world 6th Richest Businessman Anil Ambani Failure Story - Sakshi

ముఖేష్ అంబానీ గురించి తెలిసిన చాలా మందికి 'అనిల్ అంబానీ' గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ముకేశ్ అంబానీ ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఒకప్పుడు ముఖేష్ అంబానీ మాదిరిగానే.. అనిల్ అంబానీ కూడా ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉండేవారు. ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు.. ముందుచూపు లేని వ్యాపారాలు చేయడం వల్ల సంపన్నుల జాబితా నుంచి లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయిన స్థితికి చేరారు.

సరైన ప్రణాళిక, విజన్ లేకుండా ఏకకాలంలో అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికామ్, పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో గొప్ప సక్సెస్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేక పోయాయి.

ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం వంటివి కుబేరుడైన అనిల్ అంబానీని అప్పుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది.

అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, తిరిగి చెల్లించలేకపోయారు. మూడు బ్యాంకులకు సుమారు రూ.5446 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన లండన్ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో చెప్పుకున్నారు. ఈయన మొత్తం అప్పు దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలు కూలిపోతాయి అనటానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ.

ఇదీ చదవండి: వెయ్యి రూపాయలకు రూ.2 కోట్లు గిఫ్ట్‌ ఇచ్చాడు.. నువ్వు దేవుడు సామీ!

లాయర్ల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల.. అతను తన భార్య బంగారు నగలను అనిల్ అంబానీ విక్రయించినట్లు సమాచారం. తనకు కారు తప్ప మరేమీ లేదని, సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని ఆయన చెప్పుకున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి అతని మొత్తం సంపద దాదాపు రూ. 250 కోట్లు, ముంబైలో 17 అంతస్తుల ఇంటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement