వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య | Married Woman Commits Suicide in Hyderabad | Sakshi

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

Feb 20 2019 9:23 AM | Updated on Feb 20 2019 9:23 AM

Married Woman Commits Suicide in Hyderabad - Sakshi

నందిని మృతదేహం

కాచిగూడ: భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్‌పెక్టర్‌ జానకి రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్, నందినికి (24) 2013లో వివాహం జరిగింది. వీరికి ఒక కు మార్తె. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సంతోష్‌ తరచూ భార్యను వేధించేవాడు. నం దిని తల్లిదండ్రులు పలుమార్లు అల్లుడికి నచ్చజెప్పినా అతడి వైఖరిలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికిలోనైన నందిని సోమవారం రాత్రి ఇం ట్లో ఎవరూలేని సమయం లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు సంతోష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement