గుడిబండ (మడకశిర) : గుడిబండ మండలం బాలదిమ్మనపల్లికి చెందిన కాపుగుండన్నగారి హనుమంతరెడ్డి భార్య నందిని(22) అనే వివాహిత వరకట్నం వేధింపులు భరించలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ తెలిపారు. అగళి మండలం కురసంగనపల్లికి చెందిన నందిని వివాహం బాలదిమ్మనపల్లికి చెందిన హనుమంతరెడ్డితో అయింది. పెళ్లైనప్పటి నుంచి భర్త, అత్త, మామ అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండే వారని మృతురాలి తండ్రి ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.