సాక్షి, హైదరాబాద్: వి.ఎ.శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్ టోర్నమెంట్‌లో ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) క్రీడాకారులు కె. నందిని, కె. నవిత, సీహెచ్ శిరీష, సరస్వతి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ అండర్–18 బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వీరంతా విజయం సాధించారు.
ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నందిని 22–0తో కె. శిరీషపై, సీహెచ్ శిరీష 25–0తో శ్రీవల్లి పద్మావతిపై, నవిత 23–5తో బాలేశ్వరిపై, సరస్వతి 25–8తో భార్గవిపై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో కార్తీక వర్ష (నాసర్) 25–4తో దీప్తి (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, ప్రణీష (వరంగల్) 22–0తో అశ్విని (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, ఎన్. స్వాతి (మంచిర్యాల) 25–0తో పి. సరిత (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment