అపూర్వ, హారిక శుభారంభం | Apoorva, Harika won Opener Games of Carrom Tournament | Sakshi
Sakshi News home page

అపూర్వ, హారిక శుభారంభం

Published Tue, Jul 17 2018 2:07 PM | Last Updated on Tue, Jul 17 2018 2:07 PM

Apoorva, Harika won Opener Games of Carrom Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌ ఎస్‌. అపూర్వ శుభారంభం చేసింది. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సులువుగా గెలుపొందింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అపూర్వ (ఎల్‌ఐసీ) 25–0, 25–0తో పి. విజయలక్ష్మిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎ. హారిక 25–0, 25–0తో శాద్వితను ఓడించింది.

ఇతర మ్యాచ్‌ల్లో రజినీ దేవి (ఎస్‌బీఐ) 25–7, 25–4తో ప్రణీషపై, బి. పద్మజ (ఏజీఓఆర్‌సీ) 18–16, 12–0తో భాగ్యలక్ష్మిపై, బి. సునీత (డీఎల్‌ఆర్‌ఎల్‌) 25–0, 25–0తో వర్షపై, షరోన్‌ 20–9, 25–6తో లక్ష్మీ రత్నబాబు (ఏజీఓఆర్‌సీ)పై, ఎ. స్వాతి 25–0, 25–1తో టి. భానుపై గెలుపొందారు. జూనియర్‌ బాలుర విభాగంలోనూ టాప్‌ సీడ్‌ సీహెచ్‌ సాయి చరణ్‌ (మంచిర్యాల) 25–0, 25–0తో ఆకాశ్‌ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌ నాలుగోరౌండ్‌లో టాప్‌సీడ్‌ హకీమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) 25–14, 25–10తో ఎల్‌. గోపీకృష్ణపై గెలిచి ఐదోరౌండ్‌కు చేరాడు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

జూనియర్‌ బాలుర సింగిల్స్‌: జి. సాయి 25–0, 25–0తో నమన్‌పై, మొహమ్మద్‌ అఫ్నాన్‌ (మంచిర్యాల) 25–0, 25–0తో సాయికృష్ణ (ఎస్‌హెచ్‌ఎస్‌)పై, బి. రమేశ్‌ (మంచిర్యాల) 25–0, 25–3తో శ్రీను (ఏడబ్ల్యూఎస్‌ఏ)పై, అనుదీప్‌ 25–0, 25–4తో విష్ణుమూర్తిపై, సూర్య 25–0, 25–0తో చందుపై, మౌర్య 25–0, 25–11తో సాయికుమార్‌పై, రాజేశ్‌ (ఎస్‌హెచ్‌ఎస్‌) 25–7, 25–0తో శివసాయి (ఎస్‌హెచ్‌ఎస్‌)పై, రాజశేఖర్‌ (హెచ్‌వీఎస్‌) 25–0, 25–1తో రాకేశ్‌ (మంచిర్యాల)పై విజయం సాధించారు.  

పురుషుల సింగిల్స్‌ నాలుగో రౌండ్‌: మొహమ్మద్‌ అహ్మద్‌ (హెచ్‌ఎంసీసీ) 25–7, 25–0తో కలీమ్‌పై, అనూప్‌ కుమార్‌ 7–25, 25–10, 23–12తో బి. రమేశ్‌ (మంచిర్యాల)పై, జైకుమార్‌ 25–6, 25–12తో శ్రీకాంత్‌పై, కె. శ్రీనివాస్‌ (ఐఓసీఎల్‌) 25–0, 25–0తో జీఎస్‌ శర్మపై, ఆర్‌డీ దినేశ్‌ బాబు (ఏజీఓఆర్‌సీ) 25–11, 25–0తో ఆర్‌. ప్రమోద్‌ (వరంగల్‌)పై, ఎస్‌. ఆదిత్య (వి–10) 25–5, 16–18, 21–5తో జె. నర్సింగ్‌ రావుపై గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement