carrom tournament
-
క్వార్టర్స్‌లో నందిని, శిరీష
సాక్షి, హైదరాబాద్: వి.ఎ.శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్ టోర్నమెంట్లో ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) క్రీడాకారులు కె. నందిని, కె. నవిత, సీహెచ్ శిరీష, సరస్వతి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ అండర్–18 బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వీరంతా విజయం సాధించారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నందిని 22–0తో కె. శిరీషపై, సీహెచ్ శిరీష 25–0తో శ్రీవల్లి పద్మావతిపై, నవిత 23–5తో బాలేశ్వరిపై, సరస్వతి 25–8తో భార్గవిపై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో కార్తీక వర్ష (నాసర్) 25–4తో దీప్తి (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, ప్రణీష (వరంగల్) 22–0తో అశ్విని (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, ఎన్. స్వాతి (మంచిర్యాల) 25–0తో పి. సరిత (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. -
చాంపియన్ హకీమ్
రాయదుర్గం: ఆలిండియా బీఎస్ఎన్ఎల్ సర్కిల్ క్యారమ్స్ టోర్నమెంట్లో తెలంగాణ రీజియన్‌కు చెందిన హకీమ్ చాంపియన్‌గా నిలిచాడు. గచ్చిబౌలిలోని ఆర్టీటీసీ ప్రాంగణంలో జరిగిన టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో హకీమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో హకీమ్ 25–7, 17–8తో జిబాన్దేకా (అస్సాం)పై విజయం సాధించాడు. అస్సాంకే చెందిన అంజాన్ శర్మ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో గీతాదేవి (ఒడిశా) 24–10, 25–20తో బంటిలాయిశ్రమ్ను ఓడించి పసిడిని అందుకుంది. మహారాష్ట్రకు చెందిన అనిత మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌ను అస్సాం దక్కించుకోగా... మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను నార్త్ఈస్ట్ గెలుచుకుంది. తమిళనాడు (పురుషులు), కర్ణాటక (మహిళలు) జట్లు రన్నరప్‌లుగా నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముఫరఫ్ ఫారుఖీ, అంతర్జాతీయ క్యారమ్స్ క్రీడాకారిణి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్య ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో ఎస్. ఆదిత్య రెండు టైటిళ్లతో సత్తా చాటాడు. ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఆదిత్య సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో ఎస్. ఆదిత్య (వి–10) 25–16, 25–5తో మాజీ ప్రపంచ చాంపియన్ కె. శ్రీనివాస్ (ఐఓసీఎల్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఆదిత్య 25–11, 1–25, 20–18తో హకీమ్ (బీఎస్ఎన్ఎల్)పై, కె. శ్రీనివాస్ 25–11, 12–25, 25–10తో మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదిత్య– వి. శివానంద రెడ్డి ద్వయం 21–7, 20–10తో ఎస్కే వసీమ్– మొహమ్మద్ జఫర్ జోడీని ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఆదిత్య–శివానంద జంట 0–25, 25–21, 25–13తో కె. శ్రీనివాస్– బాసిల్ ఫిలిప్స్ జోడీపై, జఫర్– వసీమ్ జంట 25–6, 17–25, 25–12తో మొహమ్మద్ అహ్మద్– ఎస్కే మొహమ్మద్ జోడీపై గెలుపొందాయి. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ చాంపియన్ అపూర్వ గెలుచుకుంది. ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 20–16, 24–4తో సి. కార్తీక వర్ష (ఎన్ఏఎస్ఆర్)పై విజయం సాధించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం (హెచ్‌డీసీఏ) అధ్యక్షురాలు గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్యారమ్ సంఘం (క్యాట్స్) అధ్యక్షుడు బీకే హరినాథ్, కార్యదర్శి ఎస్. మదన్ రాజ్, హెచ్‌డీసీఏ ఉపాధ్యక్షులు నర్సింహారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్. శోభన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అపూర్వ, హారిక శుభారంభం
సాక్షి, హైదరాబాద్: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ ఎస్. అపూర్వ శుభారంభం చేసింది. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సులువుగా గెలుపొందింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–0తో పి. విజయలక్ష్మిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎ. హారిక 25–0, 25–0తో శాద్వితను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రజినీ దేవి (ఎస్బీఐ) 25–7, 25–4తో ప్రణీషపై, బి. పద్మజ (ఏజీఓఆర్‌సీ) 18–16, 12–0తో భాగ్యలక్ష్మిపై, బి. సునీత (డీఎల్ఆర్ఎల్) 25–0, 25–0తో వర్షపై, షరోన్ 20–9, 25–6తో లక్ష్మీ రత్నబాబు (ఏజీఓఆర్‌సీ)పై, ఎ. స్వాతి 25–0, 25–1తో టి. భానుపై గెలుపొందారు. జూనియర్ బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ సీహెచ్ సాయి చరణ్ (మంచిర్యాల) 25–0, 25–0తో ఆకాశ్ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్లో టాప్‌సీడ్ హకీమ్ (బీఎస్ఎన్ఎల్) 25–14, 25–10తో ఎల్. గోపీకృష్ణపై గెలిచి ఐదోరౌండ్‌కు చేరాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జూనియర్ బాలుర సింగిల్స్: జి. సాయి 25–0, 25–0తో నమన్‌పై, మొహమ్మద్ అఫ్నాన్ (మంచిర్యాల) 25–0, 25–0తో సాయికృష్ణ (ఎస్హెచ్ఎస్)పై, బి. రమేశ్ (మంచిర్యాల) 25–0, 25–3తో శ్రీను (ఏడబ్ల్యూఎస్‌ఏ)పై, అనుదీప్ 25–0, 25–4తో విష్ణుమూర్తిపై, సూర్య 25–0, 25–0తో చందుపై, మౌర్య 25–0, 25–11తో సాయికుమార్‌పై, రాజేశ్ (ఎస్హెచ్ఎస్) 25–7, 25–0తో శివసాయి (ఎస్హెచ్ఎస్)పై, రాజశేఖర్ (హెచ్‌వీఎస్) 25–0, 25–1తో రాకేశ్ (మంచిర్యాల)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్: మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ) 25–7, 25–0తో కలీమ్‌పై, అనూప్ కుమార్ 7–25, 25–10, 23–12తో బి. రమేశ్ (మంచిర్యాల)పై, జైకుమార్ 25–6, 25–12తో శ్రీకాంత్‌పై, కె. శ్రీనివాస్ (ఐఓసీఎల్) 25–0, 25–0తో జీఎస్ శర్మపై, ఆర్డీ దినేశ్ బాబు (ఏజీఓఆర్‌సీ) 25–11, 25–0తో ఆర్. ప్రమోద్ (వరంగల్)పై, ఎస్. ఆదిత్య (వి–10) 25–5, 16–18, 21–5తో జె. నర్సింగ్ రావుపై గెలుపొందారు. -
చాంపియన్స్ అపూర్వ, అహ్మద్
సాక్షి, హైదరాబాద్: వి–10 తెలంగాణ రాష్ట్ర ర్యాం కింగ్ క్యారమ్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన ఎస్. అపూర్వ విజేతగా నిలిచింది. చిక్కడపల్లిలోని పోస్టల్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో అపూర్వ, పురుషుల సింగిల్స్ విభాగంలో మొహమ్మద్ అహ్మద్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) 25–7, 25–1తో పి. నిర్మల (ఎల్ఐసీ)పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ) 25–7, 20– 10తో మొహమ్మద్ వసీమ్ (ఏసీసీఏ)ను ఓడించాడు. అంతకుముందు జరిగిన పురుషుల సెమీస్ మ్యాచ్‌ల్లో వసీమ్ 23–18, 25– 12తో ఎస్. రమేశ్‌పై, అహ్మద్ 10–25, 22–19, 25–13తో ఎంఏ హకీమ్‌పై నెగ్గారు. మహిళల సెమీస్ మ్యాచ్‌ల్లో పి. నిర్మల 25–2, 25–0తో స్వాతిపై, అపూర్వ 25–4, 25–4తో కార్తీక వర్షపై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలబాలికల విభాగంలో సీహెచ్ సాయి చరణ్, సి. కార్తీక వర్ష విజేతలుగా నిలిచారు. ఫైనల్లో సాయి చరణ్ (మంచిర్యాల) 25–14, 18–17తో ఆసిఫ్ అలీ (నిజామాబాద్)పై గెలుపొందగా, కార్తీక వర్ష (ఎన్ఏఎస్ఆర్) 24–4, 25–0తో నందినిని ఓడించింది. -
క్వార్టర్స్‌లో అపూర్వ, సయ్యద్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక సీనియర్ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ అపూర్వ, అన్‌సీడెడ్ ప్లేయర్ సయ్యద్ నయ్యర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ వేదికగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సయ్యద్ నయ్యర్ 25–5, 0–25, 25–5తో జుబేర్ ఖాన్‌పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రౌండ్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సయ్యద్ నయ్యర్ 5–23, 25–15, 22–20తో ప్రపంచ మాజీ చాంపియన్ కె. శ్రీనివాస్‌ను ఓడించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–0తో విజయ మాధవిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో సునీత 25–10, 24–2తో సుజని కుమారిపై, మాధవి 14–8, 23–7తో సిమ్రన్‌పై, తేజస్వి 25–3, 25–18తో పి. అమృతపై, అపరంజిత (ఎన్ఎఫ్సీ) 25–15, 25–0తో ఎస్పీ శ్వేతపై, హారిక 25–0, 25–7తో షరోన్‌పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు ఎస్.ఆదిత్య 23–17, 25–18తో షారుక్ ఖాన్‌పై, హకీమ్ (బీఎస్ఎన్ఎల్) 7–25, 25–7, 25–3తో జైకుమార్పై, అనిల్ కుమార్ 25–16, 25–11తో గోపీకృష్ణపై, దినేశ్ బాబు 25–10, 25–8తో సూర్యప్రకాశ్‌పై, జయప్రసాద్ 25–12, 5–25, 16–12తో సయ్యద్ జహీద్ అహ్మద్‌పై విజయం సాధించారు. -
క్యారమ్ టోర్నమెంట్ షురూ
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఇంటర్ ఇన్స్టిట్యూట్ క్యారమ్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభ మైంది. రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ గోవిందరావు ఈ టోర్నీని ప్రారంభించారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 23 ఇన్స్టిట్యూట్లకు చెందిన జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఏ నుంచి ఏజీ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా జట్లు ఆధిక్యంలో నిలవగా... గ్రూప్ బి నుంచి ఆర్బీఐ తొలిస్థానాన్ని ఆక్రమించింది. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ అపూర్వ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.