అనిల్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక సీనియర్ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ అపూర్వ, అన్‌సీడెడ్ ప్లేయర్ సయ్యద్ నయ్యర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ వేదికగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సయ్యద్ నయ్యర్ 25–5, 0–25, 25–5తో జుబేర్ ఖాన్‌పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రౌండ్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సయ్యద్ నయ్యర్ 5–23, 25–15, 22–20తో ప్రపంచ మాజీ చాంపియన్ కె. శ్రీనివాస్‌ను ఓడించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎస్. అపూర్వ (ఎల్‌ఐసీ) 25–0, 25–0తో విజయ మాధవిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో సునీత 25–10, 24–2తో సుజని కుమారిపై, మాధవి 14–8, 23–7తో సిమ్రన్‌పై, తేజస్వి 25–3, 25–18తో పి. అమృతపై, అపరంజిత (ఎన్‌ఎఫ్‌సీ) 25–15, 25–0తో ఎస్‌పీ శ్వేతపై, హారిక 25–0, 25–7తో షరోన్‌పై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు
ఎస్.ఆదిత్య 23–17, 25–18తో షారుక్ ఖాన్‌పై, హకీమ్ (బీఎస్‌ఎన్‌ఎల్) 7–25, 25–7, 25–3తో జైకుమార్‌పై, అనిల్ కుమార్ 25–16, 25–11తో గోపీకృష్ణపై, దినేశ్ బాబు 25–10, 25–8తో సూర్యప్రకాశ్‌పై, జయప్రసాద్ 25–12, 5–25, 16–12తో సయ్యద్ జహీద్ అహ్మద్‌పై విజయం సాధించారు.