సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో ఇంటర్ ఇన్‌స్టిట్యూట్ క్యారమ్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభ మైంది. రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ గోవిందరావు ఈ టోర్నీని ప్రారంభించారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 23 ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఏ నుంచి ఏజీ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా జట్లు ఆధిక్యంలో నిలవగా... గ్రూప్ బి నుంచి ఆర్‌బీఐ తొలిస్థానాన్ని ఆక్రమించింది. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ అపూర్వ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.