
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి 22 వరకు కెన్యాలోని నైరోబీలో జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్, తెలంగాణకు చెందిన అగసార నందినిలకు భారత జట్టులో చోటు లభించింది. శ్రీనివాస్ 200 మీటర్ల విభాగంలో... నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ మొత్తం 28 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.