అనుష్క శర్మలా ఉన్నానట! | Mosagallaku Mosagadu Movie Release on 22nd May | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మలా ఉన్నానట!

May 16 2015 11:39 PM | Updated on Sep 3 2017 2:10 AM

అనుష్క శర్మలా ఉన్నానట!

అనుష్క శర్మలా ఉన్నానట!

నన్ను చూసి చాలామంది ప్రముఖ హిందీ కథానాయిక అనుష్క శర్మలా ఉన్నానని అంటుంటారు.

 ‘‘నన్ను చూసి చాలామంది ప్రముఖ హిందీ కథానాయిక అనుష్క శర్మలా ఉన్నానని అంటుంటారు. అంత పెద్ద నటితో పోల్చడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది’’ అని నందిని అన్నారు. సుధీర్‌బాబు, నందిని జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. బోస్ నెల్లూరి దర్శకుడు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ -‘‘చిన్నప్పుడు మా స్కూల్ కార్యక్రమానికి సౌందర్యగారు వచ్చారు.
 
 ఆవిడని చూసి ఎలాగైనా హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నా. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎం.బీ.ఏ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా, 2011లో మిస్ ప్రెట్టీ ఐస్‌గా సెలెక్ట్ అయ్యా. మొదట నీలకంఠగారి దర్శకత్వంలో ‘మాయ’ చిత్రంలో నటించాను. కన్నడంలో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ రీమేక్‌లో కూడా చేశాను. ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’లో నాయికగా ఎంపికయ్యా.
 
  ఈ సినిమాలో నా పాత్ర పేరు జానకి. చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్రకు సముచిత ప్రాధాన్యం ఉంది. నాకు నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే గ్లామర్ మన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉండాలి కానీ దుస్తుల్లో ఉండదని నా ఫీలింగ్. ప్రస్తుతం తమిళంలో పీవీపీ పతాకంపై ‘గ్రహణం’ అనే సినిమాలో నటిస్తున్నాను. ఇంకా తమిళంలో మరో రెండు, మూడు సినిమా ఆఫర్లు రెడీ గా ఉన్నాయి. అందుకే ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement