Mosagallaku Mosagadu
-
ఆరోజు ఎన్టీఆర్ రియాక్షన్ మర్చిపోలేనిది: సూపర్ స్టార్ కృష్ణ
-
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్‌డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్‌డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్‌మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్‌గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
కౌబాయ్ గెటప్.. బఠాణీలతో మేకప్
యాభై ఏళ్ళ క్రితం సినిమా.. కౌబాయ్ కథలకు క్రేజు తెచ్చిన హిట్ సినిమా. హాలీవుడ్ కథాంశానికి తెలుగుదనం అద్ది, మళ్ళీ హాలీవుడ్‌కే వెళ్ళిన సినిమా. అప్పటికి ఏడేళ్ళుగా సినీరంగంలో ఉన్న కృష్ణను స్టార్‌ని చేసిన సినిమా. నిర్మాతగా నిలబెట్టిన సినిమా. దాస్ దర్శకత్వంలో కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు పక్కా ప్రణాళికతో వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’కు నేటితో 50 ఏళ్ళు. ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువ నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్, యాక్షన్ తరహా చిత్రాలవైపు మొగ్గింది. అలాంటి కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండిన పాశ్చాత్య కౌబాయ్ వంట ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఇంగ్లీష్ నుంచి హిట్ కథ! 1970 నాటికి కృష్ణ 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, యాక్టర్ నుంచి స్టార్ హోదా కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి కలిగింది. పెద్దమ్మాయి పేరు మీద ‘శ్రీపద్మాలయా మూవీస్’ నెలకొల్పారు. తొలి చిత్రం ‘అగ్ని పరీక్ష’ (1970) ఆడలేదు. పట్టుదల పెరిగింది. అదే సమయంలో ‘మెకన్నాస్గోల్డ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి హాలీవుడ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. వాటిని కలగలిపి, కొత్త వంట చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అలా ఆరుద్ర రాసిన కథ ‘అదృష్టరేఖ’. అదే మాస్ కోసం ‘మోసగాళ్ళకు మోసగాడు’గా టైటిల్ మార్చుకొని, కృష్ణ అదృష్టాన్ని మార్చేసిన కథ. కె.ఎస్.ఆర్. దాస్ ‘రౌడీ రాణి’ (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, ఆయనను డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో... సాహసోపేతంగా... ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమ ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథాకథనం ఈ చిత్రాన్ని స్పెషల్‌గా నిలిపాయి. 1971 జనవరి 9న వాహినీ స్టూడియోలో ఈ సాహస గాథ చిత్రీకరణ మొదలైంది. ఈ కథను చిత్రీకరించిన తీరు కూడా సాహస గాథే. అప్పట్లో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ‘‘సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్, మద్రాసు, పాండిచ్చేరీల్లో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట శ్రమపడి చిత్రీకరించాం’’ అని కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధ పాత్ర పోషించిన విజయనిర్మల సైతం కెరీర్లో ఎంతో కష్టపడి నటించిన సినిమా ఇదనేవారు. ‘‘ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసు మెరీనా సముద్రతీరంలో స్వారీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం’’ అని స్వర్గీయ విజయనిర్మల గతంలో ఈ వ్యాసకర్తకు చెప్పారు. ‘‘ఈ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌చేసి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు’’ అని కృష్ణ కెరీర్ తొలి రోజుల నుంచి ఆయనకు సన్నిహితులైన జర్నలిస్టు స్వర్గీయ మోహన్‌కుమార్ చెప్పారు. థార్ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట షూటింగ్ చేశారు. బికనీర్ కోటలో, సట్లెజ్ నదీ తీరంలోని తట్టాపానీలో తీశారు. ముఖంపై పొక్కులకు... మేకప్ మహిమ విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం కోసం కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. ముఖంపై పొక్కుల ఎఫెక్ట్ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, ‘గుడ్, బ్యాడ్, అగ్లీ’లోని ‘అగ్లీ’ పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ లాంటి మేకింగ్ విశేషాలు నేటికీ ఓ పెద్ద కథ. చక్రపాణి జోస్యం తప్పింది! ఎన్టీఆర్ అన్నట్టే అయింది!! ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత చక్రపాణి ఒకసారి షూటింగ్‌కి వచ్చారు. సెట్లోని కౌబాయ్ వాతావరణం, గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. అప్పటికే సగానికి పైగా సినిమా అయిపోయింది. దాంతో, కృష్ణ బృందం ముందుకే సాగారు. తొలి కాపీ వచ్చాకా ప్రివ్యూలు చూసినవారెవరూ, సరైన అంచనా చెప్పలేకపోయారు. హీరో ఎన్టీఆర్ మాత్రం ‘బావుంది బ్రదర్. విభిన్న మాస్ఫిల్మ్ తీశారు. స్త్రీలు చూడరు. ఫస్ట్రిలీజ్ కన్నా, రీ–రిలీజుల్లో ఎక్కువ డబ్బు వస్తుంది’ అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 బెంగళూరు సహా తెలుగునాట 27 కేంద్రాల్లో, 35 ప్రింట్లతో’’ రిలీజై, హిట్టయింది. ఇంగ్లీష్ డబ్బింగ్‌తో విదేశాలకు... పూర్తిగా ‘‘ఈస్ట్‌మన్‌కలర్‌లో నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా డైరెక్టర్, కెమేరామ్యాన్ల ఫిల్మ్. కెమేరాకోణాల్ని స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశాల్ని దాస్ అంతే వేగంగా నడిపించారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు. ఆదినారాయణరావు నేపథ్య సంగీతం, ‘కోరినది దరి చేరినది..’ డ్యూయట్ పాపులర్. అప్పటికి ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ‘సిగ్గేలా మగాడికీ’ అంటూ శృంగారనృత్యం చేయించడం విశేషం! తమిళంలో ‘మోసక్కారనుక్కు మోసక్కారన్’గా, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో, ఇంగ్లీషులో ‘ది ట్రెజర్‌హంట్’గా ఈ చిత్రం అనువాదమైంది. ‘‘ఇంగ్లీషు డబ్బింగ్ రూపం గల్ఫ్దేశాలు, సింగపూర్, కౌలాలంపూర్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది’’ అని కృష్ణ తెలిపారు. ఈ హిట్ ప్రేరణతో దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. కృష్ణ కుమారుడైన మహేశ్‌బాబుతో ఇదే జానర్లో ‘టక్కరి దొంగ’ (2002) వచ్చింది. ఆధునిక టెక్నాలజీతో, హాలీవుడ్ కౌబాయ్‌ల లొకేషన్లలో తీశారు. కానీ, ఇవేవీ తొలి విజయాన్ని మరిపించలేకపోయాయి. ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ఫిల్మ్ అంటే ‘మోసగాళ్ళకు మోసగాడే’! – రెంటాల జయదేవ ⇔హీరో కృష్ణతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4.30కు, తిరిగి రాత్రి 11.30 గం.కు. -
మరో హీరో కొడుకు ఎంట్రీ...
తెలుగు తెరకు మరో నట వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ ప్రిన్స్ మహేష్ బాబు, నాన్న హీరో సుధీర్ బాబు నుంచి నట వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఈ బుల్లి నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్‌ను వెండితెరకు పరిచయం చేశారు. తన తాజా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో ఓ చిన్న పాత్రలో చరిత్ నటించినట్లు హీరో సుధీర్ బాబు వెల్లడించారు. క్రైమ్, కామోడీతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరిత్ నటించిన విషయాన్ని సుధీర్ బాబు సినిమా రిలీజ్ అయ్యేవరకూ గోప్యంగా ఉంచటం విశేషం. 'చరిత్ మాసన్కు సినిమాలంటే చాలా ఇంట్రస్ట్, మావాడు చేసే జిమ్నాస్టిక్స్‌లో కొన్నింటిని నేను కూడా చేయలేను. మామయ్య మహేష్ బాబు సినిమాలో సాంగ్స్‌కు మూడు, నాలుగు గంటల పాటు అలిసిపోకుండా డాన్స్ కూడా చేస్తారు. ఇక స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే' అని కొడుకు గురించి చెబుతూ సుధీర్ బాబు మురిసిపోతున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నందిని నటించింది. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. -
అనుష్క శర్మలా ఉన్నానట!
‘‘నన్ను చూసి చాలామంది ప్రముఖ హిందీ కథానాయిక అనుష్క శర్మలా ఉన్నానని అంటుంటారు. అంత పెద్ద నటితో పోల్చడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది’’ అని నందిని అన్నారు. సుధీర్‌బాబు, నందిని జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. బోస్ నెల్లూరి దర్శకుడు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ -‘‘చిన్నప్పుడు మా స్కూల్ కార్యక్రమానికి సౌందర్యగారు వచ్చారు. ఆవిడని చూసి ఎలాగైనా హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నా. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎం.బీ.ఏ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా, 2011లో మిస్ ప్రెట్టీ ఐస్‌గా సెలెక్ట్ అయ్యా. మొదట నీలకంఠగారి దర్శకత్వంలో ‘మాయ’ చిత్రంలో నటించాను. కన్నడంలో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ రీమేక్‌లో కూడా చేశాను. ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’లో నాయికగా ఎంపికయ్యా. ఈ సినిమాలో నా పాత్ర పేరు జానకి. చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్రకు సముచిత ప్రాధాన్యం ఉంది. నాకు నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే గ్లామర్ మన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉండాలి కానీ దుస్తుల్లో ఉండదని నా ఫీలింగ్. ప్రస్తుతం తమిళంలో పీవీపీ పతాకంపై ‘గ్రహణం’ అనే సినిమాలో నటిస్తున్నాను. ఇంకా తమిళంలో మరో రెండు, మూడు సినిమా ఆఫర్లు రెడీ గా ఉన్నాయి. అందుకే ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’ అని చెప్పారు. -
విగ్రహాల వేటలో...
12వ శతాబ్దానికి చెందిన చాలా విలువైన సీతారాముల విగ్రహాల కోసం అందరూ వెతుకుతుంటారు. అనుకోకుండా క్రిష్‌కు ఆ విగ్రహాలు దొరికాయి. వాటిని అతనేం చేశాడు...? ఆ విషయాలు తెలియాలంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ చూడాల్సిందే. సుధీర్‌బాబు, నందిని జంటగా లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ- ‘‘12వ శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారు చేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాలను దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటనేది ఇతివృత్తం. ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీశ్ వేగేశ్న. -
సుధీర్‌బాబు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు : దాసరి
‘‘సుధీర్ బాబు ఈ టైటిల్‌తో సినిమా తీస్తున్నాడంటే కచ్చితంగా ఓ కౌబాయ్ సినిమా అనుకున్నా. కానీ ఇది ఓ డిఫరెంట్ స్టోరీ అని సుధీర్ చెప్పాడు. ఒక్కో సినిమాకు సుధీర్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు. మా చెల్లాయి విజయనిర్మల బాల నటిగా కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లయింది. రచ యితగా నాకు కూడా 50 ఏళ్లు పూర్తయ్యాయి’’ అని డా. దాసరి నారాయణరావు చె ప్పారు లక్ష్మీ న రసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. బోస్ నె ల్లూరి దర్శకుడు. మణికాంత్ కద్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల పాటల సీడీను ఆవిష్కరించి చిత్ర సమర్పకులు శంకర్ చిగురుపాటికి అందజేశారు. హీరో కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇది చాలా మంచి టైటిల్. సుధీర్‌బాబు లుక్ డిఫరెంట్‌గా ఉంది. పాటలు, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణగారి ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని విజయనిర్మల అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ - ‘‘మహేశ్‌బాబు రాలేదేంటని చాలా మంది అడిగారు. ఆయన షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ చాలా మంది మహేశ్ (అభిమానులు)లు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని తర్వాత తెలిసింది. ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్ టైనర్. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు. ఈ వేడుకలో బొత్స సత్యనారాయణ, హీరోలు శ్రీకాంత్, సుశాంత్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
'మోసగాళ్లకు మోసగాడు' ఆడియో ఆవిష్కరణ
-
కమర్షియల్ మోసగాడు
నిఖిల్ నటించిన ‘స్వామిరారా’ చిత్రం క్రైమ్ కామెడీ చిత్రాల్లో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘మోసగాళ్లకు మోసగాడు’ రూపొందుతోంది. సుధీర్ బాబు, నందిని జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై బోస్ నె ల్లూరి దర్శకత్వంలో, చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ నెల 26న పాటలను, వచ్చే నెల 7న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసాద్ వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న. -
‘మోసగాళ్లకు మోసగాడు’ వర్కింగ్ స్టిల్స్
-
మరో మోసగాడు
సూర్య దొంగ తనాల్లో ప్రావీ ణ్యుడు. ఎవరినైనా ఇట్టే దోచేస్తాడు. కానీ అతనికి దొరికిన వినాయకుని చిన్న విగ్రహం అతని జీవితాన్నే మార్చేసింది. మంచి వాడిగా మార్చింది. కథ సుఖాంతం అయింది. ఇదీ ‘స్వామి రారా’ కథ. కానీ ఈ కథ మళ్లీ మొదలైంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. సుధీర్, నందిని జంటగా లక్ష్మీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కానీ ఆ చిత్రానికి, దీనికి ఎలాంటి పోలికలూ ఉండవు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ నెల చివరి వారంలో లేదా మే మొదటివారంలో సినిమాను రిలీజ్ చేస్తామని అసోసియేట్ ప్రొడ్యూసర్ సతీశ్ వేగేశ్న తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: శంకర్ చిగురుపాటి. -
ఆ టైటిల్‌తో సినిమా అంటే ఆనందమే!
- సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు తెరపై వచ్చిన మరపురాని కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ఆ చిత్రం విడుదలైన నలభై నాలుగేళ్లకు కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు అదే ‘మోసగాళ్లకు మోసగాడు’ టైటిల్‌తో ఒక సినిమా చేయడం విశేషం. సుధీర్ బాబు, నందిత జంటగా ‘స్వామి రారా’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమాకు ఈ టైటిల్‌ను ఖరారు చేశారు. బోస్ నెల్లూరి దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం హైదరాబాద్‌లో కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు. కృష్ణ మాట్లాడుతూ - ‘‘నేను నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇప్పటికి చాలాసార్లు విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడదే టైటిల్‌తో సుధీర్‌బాబు సినిమా చేయడం ఆనందంగా ఉంది. అతని గెటప్, లుక్ బాగున్నాయి’’ అన్నారు. సుధీర్‌బాబు డాన్సులు, ఫైట్లు బాగా చేస్తున్నాడనీ, ఈ చిత్రం విజయం సాధించాలనీ విజయనిర్మల పేర్కొన్నారు. అప్పట్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ ట్రెండ్‌సెట్టర్ అనీ, క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న తాజా చిత్రకథకూ, ఆ కథకూ పోలిక లేదనీ సుధీర్‌బాబు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శంకర్ చిగురుపాటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీశ్ వేగేశ్న.