ఆ టైటిల్‌తో సినిమా అంటే ఆనందమే! | Sudheer Babu to become Mosagallaku Mosagaadu | Sakshi
Sakshi News home page

ఆ టైటిల్‌తో సినిమా అంటే ఆనందమే!

Published Thu, Mar 5 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ఆ టైటిల్‌తో సినిమా అంటే ఆనందమే!

ఆ టైటిల్‌తో సినిమా అంటే ఆనందమే!

- సూపర్‌స్టార్ కృష్ణ
తెలుగు తెరపై వచ్చిన మరపురాని కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ఆ చిత్రం విడుదలైన నలభై నాలుగేళ్లకు కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు అదే ‘మోసగాళ్లకు మోసగాడు’ టైటిల్‌తో ఒక సినిమా చేయడం విశేషం. సుధీర్ బాబు, నందిత జంటగా ‘స్వామి రారా’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమాకు ఈ టైటిల్‌ను ఖరారు చేశారు. బోస్ నెల్లూరి దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం హైదరాబాద్‌లో కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు.

కృష్ణ మాట్లాడుతూ - ‘‘నేను నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇప్పటికి చాలాసార్లు విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడదే టైటిల్‌తో సుధీర్‌బాబు సినిమా చేయడం ఆనందంగా ఉంది. అతని గెటప్, లుక్ బాగున్నాయి’’ అన్నారు. సుధీర్‌బాబు డాన్సులు, ఫైట్లు బాగా చేస్తున్నాడనీ, ఈ చిత్రం విజయం సాధించాలనీ విజయనిర్మల పేర్కొన్నారు. అప్పట్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ ట్రెండ్‌సెట్టర్ అనీ, క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న తాజా చిత్రకథకూ, ఆ కథకూ పోలిక లేదనీ సుధీర్‌బాబు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శంకర్ చిగురుపాటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీశ్ వేగేశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement