విగ్రహాల వేటలో... | 'Mosagallaku Mosagadu' on 21st May | Sakshi
Sakshi News home page

విగ్రహాల వేటలో...

Published Sun, May 10 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

విగ్రహాల వేటలో...

విగ్రహాల వేటలో...

12వ శతాబ్దానికి చెందిన చాలా విలువైన సీతారాముల విగ్రహాల కోసం అందరూ వెతుకుతుంటారు. అనుకోకుండా క్రిష్‌కు ఆ విగ్రహాలు దొరికాయి. వాటిని అతనేం చేశాడు...? ఆ విషయాలు తెలియాలంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ చూడాల్సిందే.  సుధీర్‌బాబు, నందిని జంటగా  లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ- ‘‘12వ శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారు చేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాలను దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటనేది ఇతివృత్తం. ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్  ఖాద్రి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీశ్ వేగేశ్న.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement