మరో మోసగాడు | sudheer babu new movie mosagallaku mosagadu | Sakshi
Sakshi News home page

మరో మోసగాడు

Published Fri, Apr 3 2015 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

మరో మోసగాడు

మరో మోసగాడు

సూర్య దొంగ తనాల్లో ప్రావీ ణ్యుడు. ఎవరినైనా ఇట్టే దోచేస్తాడు. కానీ అతనికి దొరికిన వినాయకుని చిన్న విగ్రహం అతని జీవితాన్నే మార్చేసింది. మంచి వాడిగా మార్చింది.  కథ సుఖాంతం  అయింది. ఇదీ ‘స్వామి రారా’ కథ. కానీ ఈ కథ మళ్లీ మొదలైంది.  సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. సుధీర్, నందిని జంటగా లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కానీ ఆ చిత్రానికి, దీనికి ఎలాంటి పోలికలూ ఉండవు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ నెల చివరి వారంలో లేదా మే మొదటివారంలో సినిమాను రిలీజ్ చేస్తామని అసోసియేట్ ప్రొడ్యూసర్ సతీశ్ వేగేశ్న తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: శంకర్ చిగురుపాటి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement