కమర్షియల్ మోసగాడు | Mosagallaku Mosagadu audio release on 26th April | Sakshi
Sakshi News home page

కమర్షియల్ మోసగాడు

Published Wed, Apr 22 2015 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

కమర్షియల్ మోసగాడు

కమర్షియల్ మోసగాడు

నిఖిల్ నటించిన ‘స్వామిరారా’ చిత్రం క్రైమ్ కామెడీ చిత్రాల్లో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘మోసగాళ్లకు మోసగాడు’ రూపొందుతోంది. సుధీర్ బాబు, నందిని జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై బోస్ నె ల్లూరి దర్శకత్వంలో, చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ నెల 26న పాటలను, వచ్చే నెల 7న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసాద్ వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement