
గ్రహణంతో అదృష్టం
కాలం కలసి రాకపోతే గ్రహణం పట్టిందంటారు. అలాంటి గ్రహణమే అదృష్టం నందిని వరించింది. అర్థం కాలేదా? గ్రహణం చిత్రం ద్వారా ఈ బ్యూటీ కథానాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మిస్తున్న తాజా చిత్రాలలో గ్రహణం ఒకటి. నవ దర్శకుడు ఇళన్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కష్ణ, చంద్రన్ హీరోలుగా నటిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బిగ్ ప్రింట్ సంస్థ అధినేతలు శోభన్‌బాబు, కార్తీక్ సహా భాగస్వామ్యం పంచుకుంటున్నారు.
ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి నందిని పంచుకుంటూ 2010లో అందాల ఫోటోలో మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని గెలుచుకున్నాను. ఆ తరువాత పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. అలా తెలుగులో మాయ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేశాను. దాంతో కన్నడంలో పిలుపొచ్చింది. అక్కడ ఖుషి ఖుషియాణి చిత్రం చేశాను. అడిషన్ ద్వారా ఈ గ్రహణం చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికయ్యాను. నటనలో, సంభాషణల ఉచ్చారణలో చాలా రిహార్సిల్స్ చేసి షూటింగ్ సిద్ధం అయ్యాను. ఇది నాకు సరికొత్త అనుభవం.
చిత్రంలో తన కలను నెరవేర్చుకోవడానికి తపన పడే యువతి స్వేత పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇళన్‌నూతన దర్శకుడైనా చాలా క్లారిటీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు హీరోలకు ధీటుగా నా పాత్ర ఉంటుంది. హీరో కృష్ణ చాలా జాలీ టైప్. షూటింగ్ స్పాట్‌లో జోకులతో నవ్విస్తూ అందరూ సరదాగా ఉండాలనే లక్ష్యం ఆయన ప్రవర్తన ఉంటుంది. గ్రహణం చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.