
బుల్లితెర నటి భర్త ఆత్మహత్య
పెరంబూర్: బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్లితే విరుగంబాక్కం, వీఎస్‌ఎన్.నగర్ 3వ వీధికి చెందిన రవిచంద్రన్ కొడుకు కార్తికేయన్. ఇతను టీ.నగర్‌లో జిమ్‌ను నిర్వహించేవాడు. రెండే ళ్ల క్రితం వెన్నెల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని నెలలకే ఆమె మరణించింది. కాగా కార్తికేయన్ జిమ్‌కు బుల్లితెర తారలు వస్తుండేవారు.
అలా వెళ్లన బుల్లితెర నటి నందినితో కార్తికేయన్ పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతంతో ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.నందిని శరవణన్ మీనాక్షి సీరియల్‌లో మైనా పాత్రలో నటిస్తోంది. ఆమె నటి కావడంతో రోజూ అర్ధరాత్రి వేళల్లో ఇంటి కి వెళ్లేదట. ఈ విషయంలో కార్తికేయన్, నందినిల మధ్య తర చూ గొడవలు జరిగేవని సమాచారం. అంతే కాదు నందినిపై కార్తికేయన్‌కు అనుమానం కలగడంతో ఆమెకు కొన్ని ఆంక్షలు విధించారని సమచారం.
అయితే ఆ ఆంక్షలు నందిని పెడచెవిన పెట్టడంతో విభేదాలు తలెత్తి ఇద్దరూ విడిపోయారట.ఇలాంటి పరిస్థితుల్లో కార్తికేయన్ మంగళవారం నందినికి ఫోన్ చేయగా ఆమె దుర్భాషలాడినట్లు సమాచారం. అనంతరం కార్తికేయన్ తను తరచూ బస చేసే స్థానిక వడపళని, పొన్నియమ్మాళ్ వీధిలోని గెస్ట్‌హౌస్‌కు వెళ్లాడు.అయితే రాత్రి పొద్దుపోయినా కార్తికేయన్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి శాంతి అతను బస చేసే గెస్ట్‌హౌస్‌కు వచ్చింది.
ఇంటి లోపల తాళం వేసి ఉండడంతో చాలా సేపు తలుపు కొట్టినా కార్తికేయన్ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన శాంతి వెంటనే విరుగంబాక్కం పోలీసులకు ఫోన్ చేసింది.వెంటనే అక్కడి వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించగా కార్తికేయన్ నోటిలో నురగలు కక్కి నిర్జీవంగా పడిఉన్న దృశ్యం కనిపించింది.
అతను విషం కలిపిన శీతల పానీయం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.కార్తికేయన్ పడి ఉన్న సమీపంలో మూడు లెటర్లు ఉన్నాయి.వాటిని తీసుకుని కార్తికేయన్ భౌతిక కాయాన్ని రాజపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకెత్తించింది.