
లుసానే (స్విట్జర్లాండ్): ‘ఫిడే’ మహిళల చెస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మేరీ సెబాగ్‌తో మంగళవారం జరిగిన రెండో గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ పియా క్రామ్లింగ్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉంది. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment