Game draw
-
అరోనియన్‌తో అర్జున్ గేమ్ ‘డ్రా’
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ అరోనియన్‌తో చెన్నైలో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను అర్జున్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇదే వేదికపై జరుగుతున్న చెన్నై చాలెంజర్స్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. లియోన్ మెండోకాతో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో హారిక 43 ఎత్తుల్లో ఓడింది. -
హారిక రెండో గేమ్ ‘డ్రా’
లుసానే (స్విట్జర్లాండ్): ‘ఫిడే’ మహిళల చెస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మేరీ సెబాగ్‌తో మంగళవారం జరిగిన రెండో గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ పియా క్రామ్లింగ్తో సోమవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉంది. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
హారిక గేమ్ ‘డ్రా’
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ రెండో రౌండ్ మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించింది. ఇరాన్‌లోని టెహరాన్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. దినారా సదుకసొవా (కజకిస్తాన్)తో జరుగుతున్న రెండో రౌండ్ తొలి గేమ్ 15 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. తెల్ల పావులతో ఈ గేమ్ ఆడిన హారిక పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందలేకపోయింది. బుధవారం ఇద్దరి మధ్య రెండో గేమ్ జరుగుతుంది. -
హారికకు మరో డ్రా
క్యాప్ డి అగ్డె (ఫ్రాన్స): అనతోలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ హారిక మరో గేమ్ డ్రా చేసుకుంది. గురువారం సెబాగ్ మేరీ (ఫ్రాన్స)తో జరిగిన 13వ రౌండ్‌ను హారిక 87 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. అంతకుముందు బుధవారం రాత్రి జరిగిన 12వ రౌండ్లో హారిక 61 ఎత్తుల్లో ఎడౌర్డ్ రొమైన్ (ఫ్రాన్స)పై విజయం సాధించింది. 13వ రౌండ్ తర్వాత హారిక 6.5 పారుుంట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయి0ట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)తో జరిగిన మూడో రౌండ్లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయి0ది. -
హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో పోటీపడిన హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హారిక 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత హాంపి ఖాతాలో 2 పాయిం ట్లు, హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉన్నాయి. 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ 23న ముగుస్తుంది. -
మహిళల జట్టుకు తొలి విజయం
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ చెంగ్డూ (చైనా): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలి విజయం సాధించింది. గురువారం అమెరికాతో జరిగిన ఐదో రౌండ్లో భారత్ 3-1తో నెగ్గింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 60 ఎత్తుల్లో అబ్రహమ్యాన్ను ఓడించి ఆధిక్యాన్ని అందించింది. ద్రోణవల్లి హారిక 58 ఎత్తుల్లో నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను.. పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో ఫొయిసర్తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించారు. సౌమ్య స్వామినాథన్ 57 ఎత్తుల్లో అలీసా మెలెకినాను ఓడించింది. శుక్రవారం జరిగే ఆరో రౌండ్లో భారత జట్టు ఈజిప్టుతో తలపడుతుంది. పురుషుల జట్టు ఓటమి సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ ఐదో రౌండ్లో భారత జట్టు 1.5-2.5 తేడాతో ఉక్రెయిన్ చేతిలో ఓడింది. ఇది భారత జట్టుకు రెండో పరాజయం. హరికృష్ణ, పొనోమరియోవ్ గేమ్ 46 ఎత్తుల్లో డ్రా అయ్యింది. సేతురామన్, ఇవాన్చుక్ గేమ్ 32 ఎత్తుల్లో... విదిత్, మొయిసీంకో గేమ్ 56 ఎత్తుల్లో డ్రా అయ్యాయి. శశికిరణ్ 41 ఎత్తుల్లో క్రివోరుచ్కో చేతిలో ఓడాడు. ఆరో రౌండ్లో భారత జట్టు రష్యాతో తలపడుతుంది. -
ప్రత్యూష ఆరో గేమ్ డ్రా
సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో డ్రాను నమోదు చేసింది. గురువారం నిమ్మి ఏజీతో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష 32 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. తెల్ల పావులతో ఆడినా ప్రత్యూషకు విజయం మాత్రం దక్కలేదు. ఇవానా మరియా ఫుర్టాడోతో జరిగిన మరో గేమ్‌లో తెల్లపావులతోనే ఆడిన ఏపీ అమ్మాయి కె.లక్ష్మీ ప్రణీత 56 ఎత్తుల్లో ఓడింది. ఇంటర్నేషనల్ మాస్టర్ మోహిత నిషాతో జరిగిన గేమ్‌లో తెలంగాణ క్రీడాకారిణి హిందుజా రెడ్డి 47 ఎత్తుల తర్వాత ఓటమిపాలైంది. -
హరికృష్ణ గేమ్ డ్రా
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆడిన తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... సెర్గీ కర్యాకిన్ (రష్యా)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. భారత్ నుంచి మాస్టర్స్ విభాగంలో కేవలం హరికృష్ణ మాత్రమే పోటీపడుతున్నాడు. సోమవారం జరిగే మూడో రౌండ్లో క్యూబా గ్రాండ్‌మాస్టర్ లీనియర్ డొమింగెజ్‌తో హరికృష్ణ తలపడతాడు.