ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్
చెంగ్డూ (చైనా): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలి విజయం సాధించింది. గురువారం అమెరికాతో జరిగిన ఐదో రౌండ్‌లో భారత్ 3-1తో నెగ్గింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 60 ఎత్తుల్లో అబ్రహమ్యాన్‌ను ఓడించి ఆధిక్యాన్ని అందించింది. ద్రోణవల్లి హారిక 58 ఎత్తుల్లో నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను.. పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో ఫొయిసర్‌తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించారు. సౌమ్య స్వామినాథన్ 57 ఎత్తుల్లో అలీసా మెలెకినాను ఓడించింది. శుక్రవారం జరిగే ఆరో రౌండ్‌లో భారత జట్టు ఈజిప్టుతో తలపడుతుంది.
పురుషుల జట్టు ఓటమి
సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ ఐదో రౌండ్‌లో భారత జట్టు 1.5-2.5 తేడాతో ఉక్రెయిన్ చేతిలో ఓడింది. ఇది భారత జట్టుకు రెండో పరాజయం. హరికృష్ణ, పొనోమరియోవ్ గేమ్ 46 ఎత్తుల్లో డ్రా అయ్యింది. సేతురామన్, ఇవాన్‌చుక్ గేమ్ 32 ఎత్తుల్లో... విదిత్, మొయిసీంకో గేమ్ 56 ఎత్తుల్లో డ్రా అయ్యాయి. శశికిరణ్ 41 ఎత్తుల్లో క్రివోరుచ్‌కో చేతిలో ఓడాడు. ఆరో రౌండ్‌లో భారత జట్టు రష్యాతో తలపడుతుంది.
మహిళల జట్టుకు తొలి విజయం
Published Fri, Apr 24 2015 1:09 AM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM
Advertisement