
భారత స్టార్ చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పెళ్లి కూతురు కానుంది. సివిల్ ఇంజనీర్ అయిన కార్తీక్ చంద్రతో ఈనెల 18న హైదరాబాద్‌లో హారిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 19న పెళ్లి జరుగుతుంది.
2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక... 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది.