ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయం సాధించింది
ఆసియా కాంటినెంటల్ చెస్
అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయం సాధించింది. గురువారం జరిగిన ఓపెన్ విభాగంలో తను భారత్‌కే చెందిన పి.కార్తికేయన్‌ను ఓడించింది. ప్రస్తుతం 2.5పాయింట్లతో కొనసాగుతోంది. అలాగే ఏపీకి చెందిన ద్రోణవల్లి హారిక చైనాకు చెందిన యువాన్ క్వింగ్యుతో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించింది. మరోవైపు మూడో రౌండ్‌లో ఓటమిని ఎదుర్కొన్న ఎంఆర్ లలిత్ బాబు నాలుగో రౌండ్‌లో ఎనాముల్ హొస్సేన్ (బంగ్లాదేశ్)పై నెగ్గాడు. విష్ణు ప్రసన్న, సూర్యశేఖర గంగూలీ 3.5 పాయింట్లతో సంయుక్తంగా తమ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.