
హరికృష్ణకు ఏడో స్థానం
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్ గేమ్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక నిరాశ పరి చారు. పురుషుల ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ ఏడో స్థానంలో... మహిళల ర్యాపిడ్ విభాగంలో హారిక 14వ స్థానంలో నిలిచారు. నిర్ణీత ఏడు రౌండ్‌ల త ర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లు సాధించగా... హారిక 2.5 పాయింట్లు సంపాదించింది. పురుషుల విభాగంలో షక్రియార్ మమెదైరోవ్ (అజర్‌బైజాన్-5 పాయిం ట్లు), మహిళల విభాగంలో తాన్ జోంగి (చైనా-6 పాయింట్లు) విజేతలుగా నిలిచారు.