హరికృష్ణ జోరు | International chess tournament Hari Krishna joru | Sakshi
Sakshi News home page

హరికృష్ణ జోరు

Published Mon, Feb 29 2016 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

హరికృష్ణ జోరు

హరికృష్ణ జోరు

హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలిరోజు ఆదివారం 10 రౌండ్‌లు పూర్తయ్యాక రెండో స్థానంలో నిలిచిన హరికృష్ణ... సోమవారం 20 రౌండ్‌లు ముగిశాక రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం హరికృష్ణ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. రెండో రోజు జరిగిన 10 రౌండ్ల గేముల్లో హరికృష్ణ నాలుగింటిలో గెలిచి, ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 20 రౌండ్‌ల తర్వాత 9.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మంగళవారం మరో 10 రౌండ్‌లు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement