సంగీత్‌లో అదరగొట్టిన చెస్‌ క్వీన్‌ | Harika Dronavalli Sangeet Ceremony | Sakshi
Sakshi News home page

సంగీత్‌లో అదరగొట్టిన చెస్‌ క్వీన్‌

Published Sat, Aug 18 2018 10:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Harika Dronavalli Sangeet Ceremony - Sakshi

హారిక ద్రోణవల్లి - కార్తీక్‌ చంద్ర

సాక్షి, హైదరాబాద్‌ : చెస్ క్వీన్‌, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక  ద్రోణవల్లి పెళ్లి పీటలెక్కుతోంది. రేపు(ఆగస్టు 19న) ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్‌ ఇంజినీర్‌ కార్తీక్‌ చంద్రను ఆమె పెళ్లాడుతోంది. హైదరాబాద్‌లో ఆమె సంగీత్‌ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సంగీత్‌లో పాల్గొన్న ప్రముఖులు, సన్నిహితులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆట పాటలతో సందడి చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు సైతం ఆమె కుటుంబ సభ్యులతో పాల్గొని, సంగీత్‌ను ఎంజాయ్‌ చేశారు. ఈ సంగీత్‌లో చెస్‌ క్వీన్‌ వేసిన స్టెపులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. చెక్‌ క్వీన్‌ అ..ఆ మూవీలోని ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ వేసి అదరగొట్టారు. ఆహా నా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట అనే పాటలకే వేసిన డ్యాన్స్‌లు కూడా సంగీత్‌ను సూపర్బ్‌ అనిపించాయి. 

హారిక జనవరి 12న గుంటూరులో జన్మించింది.చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అద్భుతంగా రాణించింది. అండర్‌-9 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2008లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక.. 2011లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి రికార్డు కెక్కింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement