చైన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల స్పీడ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత టాప్ ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ఆమె 4.5–5.5తో లీ తావో న్యూయెన్ ఫామ్ (వియత్నాం) చేతిలో ఓటమిపాలైంది. అయితే భారత యువ మహిళా గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు సంచలన విజయాన్ని నమోదు చేసింది. బల్గేరియాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ ఆంటోయినెటే స్టెఫనోవాను 6–5తో ఓడించింది. కరోనా కారణంగా ఈ టోర్నీ ఆన్‌లైన్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment