ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి
మోంటెకార్లో (మొనాకో): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తొలి పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 59 ఎత్తుల్లో ఓడిపోయింది. నాలుగో రౌండ్ తర్వా త హంపి 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది.