పెంగ్‌షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో నిర్ణీత 22 రౌండ్‌లు ముగిశాక హంపి 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 11.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్‌జి 15 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment