![YS Jagan Mohan Reddy Congratulates Koneru Humpy For Winning Crains Cup - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/19/Humpy.jpg.webp?itok=dFpFAO5w)
చాంపియన్ హంపికి విన్నర్స్ ట్రోఫీ, 45 వేల డాలర్ల చెక్ అందజేస్తున్న నిర్వాహకులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక కెయిన్స్ కప్ టైటిల్ గెల్చుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అభినందనలు తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరిగిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో చివరి గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని హంపి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. కొత్త ఏడాదిని గొప్ప విజయంతో మొదలుపెట్టిన కోనేరు హంపి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment