హంపి, హారికలకు నిరాశ
Published Wed, Dec 28 2016 3:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఎనిమిదో రౌండ్ ముగిశాక హారిక 4 పాయింట్లతో 16 వ స్థానంలో, హంపి 4 పాయింట్ల తోనే 20 వ స్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగిన నాలుగు గేముల్లో హంపి మూడింటిని ‘డ్రా’ చేసుకుని, మరో గేములో ఓడింది. హారిక రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుని , ఒక గేములో గెలిచి, మరో గేములో ఓడిపోయింది. బుధవారం మరో నాలుగు గేములు జరుగనున్నాయి. మరో వైపు ఓపెన్ విభాగంలో పదో రౌండ్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు
Advertisement
Advertisement