సాక్షి, విజయవాడ : ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం తన 15 ఏళ్ల కల అని అన్నారు. ఆరేళ్ల వయసు నుంచి చెస్ ప్లేయర్‌గా రాణిస్తున్నానని.. రెండు సంవత్సరాల బ్రేక్ తర్వాత చెస్ ఆడటం కొంచెం కష్టమనిపించిందన్నారు. తనకు పాప పట్టడం వల్ల రెండేళ్ల వరకు ఆట జోలికి వెళ్లలేదని, తిరిగి ఆడిన గేమ్ ప్రపంచ ఛాంపియన్‌గా గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.(కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు)
తన విజయాన్ని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యర్థులతో ఎత్తుకు పైఎత్తు వేసి మేధస్సుకు పని చెప్పానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, భర్త పాత్ర ఎంతోగానో ఉందని తెలిపారు. ఎన్నో జయాపజయాలను చవి చూశానని...అపజయాలను అధిగమించి ప్రపంచ ఛంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని టోర్నమెంట్లు ఆడి దేశం గర్వించేలా చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment