చైనా, అమెరికాలతో భారత జట్ల డ్రా
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్
చెంగ్డూ (చైనా): తొలి రౌండ్‌లో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న భారత మహిళల జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఆతిథ్య చైనా జట్టుతో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2 పాయింట్లతో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హంపి 34 ఎత్తుల్లో జూ వెన్‌జున్‌పై నెగ్గగా... హారిక 33 ఎత్తుల్లో తాన్ జాంగితో ‘డ్రా’ చేసుకుంది. పద్మిని రౌత్, షెన్ యాంగ్‌ల మధ్య గేమ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... మేరీ ఆన్‌గోమ్స్ 32 ఎత్తుల్లో లీ తింగ్‌జి చేతిలో ఓడిపోయింది.
మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా జట్టుతో మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’గా ముగించింది. శామ్యూల్ శాంక్‌లాండ్‌తో హరికృష్ణ 46 ఎత్తుల్లో; అలెగ్జాండర్ ఒనిస్‌చుక్‌తో సేతురామన్ 34 ఎత్తుల్లో; అకోబియాన్‌తో శశికిరణ్ 44 ఎత్తుల్లో; నరోద్‌స్కీతో విదిత్ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు.
‘డ్రా’లతో సరి...
Published Tue, Apr 21 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement
Advertisement