ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం తన 15 ఏళ్ల కల అని అన్నారు.