
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి చివరిదైన నాలుగో అంచె పోటీల్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి, ప్రపంచ మహిళల రాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి సెమీ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హంపి 6–5తో వాలెంటినా గునినా (రష్యా)పై విజయం సాధించింది. సెమీస్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా)తో హంపి తలపడుతుంది. హూ యిఫాన్ తన క్వార్టర్స్ మ్యాచ్‌లో 7.5–3.5తో జన్సయ అబ్దుమాలిక్ (కజకిస్తాన్)పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment