చెంగ్డు: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి తమ గేమ్‌లను డ్రాగా ముగించారు. గురువారం లీలా జవకిశ్‌విలీతో జరిగిన గేమ్‌ను హంపి డ్రా చేసుకున్నప్పటికీ 4 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. మరో మ్యాచ్‌లో పియా క్రామ్లింగ్‌తో జరిగిన గేమ్ ను హారిక డ్రాగా ముగించింది. ఆమె ప్రస్తుతం 3.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.